చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం చంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు. చిరంజీవి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ఉదయం నుండి అభిమానులు , సినీ , రాజకీయ , ఇతర రంగాలకు చెందిన వారంతా పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ఆయనకు బెస్ట్ విషెష్ అందజేస్తూ వారి అభిమానాన్ని , ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెస్ట్ విషెష్ ను అందజేశారు.

మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిన నటుడని కొనియాడారు. బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. నిండు నూరేళ్లూ ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ ద్వారా బెస్ట్ విషెష్ ను అందించారు. ‘నేను ప్రేమించే, గౌరవించే.. ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను అంటూ ప‌వ‌న్ ట్విట్ట‌ర్‌లో పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలిపాడు.

అలాగే మేనల్లుడు , హీరో సాయిధ‌రమ్ తేజ్ తన ట్విట్టర్ లో ‘నా ఇన్‌స్ప్రేషన్.. నా ప్రియమైన మామ.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి. మీరు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాలని.. జీవితంలోని ప్రతి రంగాలలో మాకు ఇలా స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు. వీరితో పాటుగా వ‌రుణ్‌తేజ్, శ్రీకాంత్‌, హ‌రీష్ శంక‌ర్ ఇలా ప‌లువ‌రు సినీ సెల‌బ్రెటీలు చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియజేశారు.