కెసిఆర్‌కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలుః చంద్రబాబు

వేడుకలు జరుపుతున్న బిఆర్ఎస్ శ్రేణులు

chandrababu-wishes-cm-kcr-on-his-birthday

అమరావతిః తెలంగాణ సీఎం కెసిఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా కెసిఆర్ కు విషెస్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ కు దీర్ఘాయుష్షు కలగాలని, మంచి ఆరోగ్యం లభించేలా దేవుడి దీవెనలు అందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.