చంద్రబాబు పర్యటనకు వస్తున్న జనసంద్రం..సంబరాల్లో నేతలు

టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న జిల్లాల పర్యటనకు జనాలు భారీ ఎత్తున వస్తుండడం తో నేతల్లో కొత్త ఉత్సవం పుడుతుంది. ‘ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా‘ పేరుతో గత కొద్దీ రోజులుగా జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు నిర్వహించి చంద్రబాబు జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. విజయనగరం , విశాఖ తో పాటు తదితర జిల్లాలోనూ చంద్రబాబు పర్యటించారు.

చంద్రబాబు ఎక్కడికి వెళ్లిన ప్రజలు బ్రహ్మ రథంపడుతున్నారు. చంద్రబాబు కూడా తన స్టయిల్ మార్చుకున్నారు. గతంలో బహిరంగ సభల్లో ప్రత్యర్థుల పట్ల కాస్త సాఫ్ట్ గా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆలా కాదు బహిరంగ సభల్లో ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తూ మాస్ డైలాగ్స్ వదులుతున్నారు. చంద్రబాబు నుండి పవర్ ఫుల్ డైలాగ్స్ వస్తుండడం తో నేతలు, కార్య కర్తల్లో ఉత్సహం మరింత పెరుగుతుంది.

టీడీపీ ఆవిర్భావం సమయంలో జనం ఎలా బారులు తీరేవారో ఇప్పుడు కూడా అలా వస్తుండంతో చంద్రబాబును ఎన్టీఆర్‎ను మరిపిస్తున్నారనే భావన టీడీపీ నేతలు, కార్యకర్తల్లో కలుగుతోంది. ఇక చంద్రబాబు పర్యటన ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ప్రజల్లో వైసీపీ ఫై ఏర్పడిన వ్యతిరేకతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన జగన్ అక్కడ నుండి ఒకొక్కటిగా ప్రజా వ్యతిరేక విధానాలకే పాల్పడుతున్నారని , ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని , అందుకే ఇప్పుడు బాబు కు జై జైలు కొడుతున్నారని అంటున్నారు.