జగన్ కు షాక్ ఇచ్చిన సిబిఐ..

cm jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సిబిఐ షాక్ ఇచ్చింది. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్​లో మాస్టర్స్ డిగ్రీ చేసారు. పారిస్​లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి వచ్చే నెల 2న కాన్వకేషన్ తీసుకోనున్నారు. కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమానికి సీఎం తో పాటుగా కుటుంబ సభ్యులు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా అయితే దానికి సీబీఐ హోర్టు అనుమతి కావాలి. జగన్ మీద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసు కోర్టులో విచారణలో ఉంది.

దాంతో జగన్ విదేశాలకు వెళ్లాలీ అంటే సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో ఆయన తరఫున న్యాయవాదులు అనుమతి కోరుతూ తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్ తరచూ విదేశీ పర్యటనలు చేపడుతున్నారని ఆయనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కోర్టులో వాదించింది. జగన్ కి అనుమతి ఇస్తే విచారణకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది అని కూడా పేర్కొంది. అంతే కాకుండా జగన్ పలు కారణాలు చూపించి విదేశాలకు వెళ్తున్నారు అని కూడా ఆరోపించింది. దీని మీద సీబీఐ కోర్టు విచారణకు వాయిదా వేసింది.

ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి.. పారిస్‌ లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు దక్కింది. ఆ సమయంలోనూ సీఎం జగన్ బెంగుళూరు వెళ్లి కుమార్తెను పారిస్ పంపారు. ఇక, ఇప్పుడు కాన్వకేషన్ లో పాల్గొనేందుకు వెళ్లాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు సిబిఐ బ్రేక్ వేసింది.