సీబీఐకి వివేకా కుమార్తె వాంగ్మూలం

అవినాశ్ రెడ్డి పాత్ర‌పై విచార‌ణ చేయించాల‌ని స్పీక‌ర్‌కు లేఖ‌

అమరావతి : సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. త‌న తండ్రి హ‌త్య‌లో వ‌రస‌కు త‌న సోద‌రుడు అయిన క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉంద‌ని, ఈ దిశ‌గా విచార‌ణ చేయించాలంటూ వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి నేరుగా లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాకు లేఖ రాశారు.

లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాకు రాసిన లేఖకు.. తాను ఇచ్చిన వాంగ్మూలం కాపీతో పాటు ఇత‌ర నిందితులు, సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల‌ను కూడా ఆమె జ‌త చేయ‌డం గ‌మ‌నార్హం. త‌న తండ్రి అంటే అవినాశ్ రెడ్డికి గిట్ట‌ద‌ని ఆరోపించిన సునీత‌.. త‌న తండ్రి హ‌త్య‌లో అవినాశ్ రెడ్డికి ప్ర‌మేయం ఉంద‌ని కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపిన సంగ‌తి తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/