ఏపీ నగరాల ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి

వివేకం లేని పాలన అంటూ విమర్శలు..చంద్రబాబు

అమరావతి: కేంద్రం విడుదల చేసిన నివాసయోగ్య నగరాల జాబితాలో ఏపీ నగరాల పరిస్థితి దిగజారిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివేకంలేని వైస్సార్సీపీ పాలనలో ఏపీ నగరాల ప్రమాణాలు పడిపోయాయని అన్నారు. ఏపీ ఆధ్యాత్మిక రాజధానిగా ఎంతో ప్రతిష్ఠ కలిగివున్న తిరుపతి నగరం 4వ స్థానం నుంచి 46వ స్థానానికి పడిపోవడమే అందుకు నిదర్శనమని విమర్శించారు. నివాసయోగ్య నగరాల జాబితాలో విజయవాడ సైతం 9వ స్థానం నుంచి 41వ ర్యాంకుకు పతనమైందని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల దుస్థితిని తాజా ర్యాంకులు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. త్వరలోనే వైస్సార్సీపీ కి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/