అప్పుడే ఆ అమరజీవి ఆత్మకు శాంతి

పొట్టి శ్రీరాములు సాధించి పెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేకుండా పోయింది.. చంద్రబాబు

chandrababu

న్యూఢిల్లీ: టిడిపి అధినేత చంద్రబాబు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సాధించి పెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేకుండా పోయిందంటూ విమర్శించారు. . పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు దీనిపై స్పందిస్తూ… ‘తెలుగు వారికి ఒక రాష్ట్రం సాధించడం కోసం 58 రోజుల ఆమరణ దీక్ష చేసి ఇదే రోజున అమరులయ్యారు పొట్టి శ్రీరాములుగారు. ఆయన సాధించి పెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేకుండా పోయింది’ అని చంద్రబాబు చెప్పారు.

‘నాడు పొట్టి శ్రీరాములు గారు చేసిన అహింసాయుత పోరాటం స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని సాధించుకున్ననాడే ఆ అమరజీవి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ త్యాగధనుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు నాయుడు చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/