ముస్లిం సోదరులకు హరీష్ రావు రంజాన్ శుభాకాంక్షలు
రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందని వెల్లడి

Hyderabad: ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం సోదరులకు మంత్రి హరీష్ రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ పవిత్రతకు ,త్యాగానికి చిహ్నమని ,పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు.
సేవాదృక్పథం, సోదరభావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లిం సోదరులు సంతోషం గా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారే వేడుకగా జరుపుకుని యావత్ ప్రపంచ ప్రజలు అందరూ బాగుండాలి అని కోరారు. కరోనా మహమ్మారి భారీ నుండి అందరం బయట పడాలని ఆ అల్లాని ప్రార్ధించాలని కోరారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/