నేడు హైకోర్టులో చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నేడు ఏపీ హైకోర్టు లో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు A1 గా ఉన్నారు. దాంతో పాటూ అసైన్డ్ భూముల కేసులో కూడా హైకోర్టు ఈరోజు తీర్పును ఇవ్వనుంది. రాజధాని గ్రామాల పరిధిలో అసైన్డ్ భూములు సేకరణలో బాబు, మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ 2021లో కేసు నమోదు చేసింది. దీని మీద ఇప్పటికే విచారణ ముగిసింది. దీని కోర్టు నేడు తీర్పును వెలువరించాల్సి ఉన్న నేపథ్యంలో కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ కొత్తగా రెండు పిటిషన్లను దాఖలు చేసింది. అయితే ఈరోజు హైకోర్టులో పిటిషన్లను విచారిస్తారా లేక ఇప్పటికే విచారణ ముగిసిన నేపథ్యంలో తీర్పును వెలువరిస్తారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది.

మరోపక్క చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. తన బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీనిపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లి 37 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో జరుగుతున్న విచారణలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.