చంద్రబాబు హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన జైలు సూపరింటెండెంట్

Chandrababu Health Bulletin Update

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ గత 40 రోజులులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు హెల్త్ బులిటిన్ ను జైలు సూపరింటెండెంట్ రిలీజ్ చేసారు. చంద్రబాబుకు 8 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

అయితే, చంద్రబాబు బరువును హెల్త్ బులిటెన్ లో అధికారులు తెలపలేదు. ఇక, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పరీక్షించి జైలు అధికారులకు నివేదిక సమర్పించారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటె టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 23న రాజమండ్రిలో సమావేశం కానున్నారు. లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన టీడీపీ-జనసేన జేఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల దిశగా ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదర్చడం తదితర అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ కార్యక్రమాల జోరు పెంచేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేయడంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.