అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని అందుకోవాలి

తనకెందుకులే అనుకుంటే అల్లూరి గురించి చెప్పుకునేవాళ్లం కాదు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌ వేదికగా ఏపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈసందర్భంగా అమరావతి రైతులు ఉద్యమం ప్రారంభించి 200 రోజులు గడుస్తున్నయన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకు వెళదామని చెప్పారు. ‘మన్నెం ప్రజల సమస్యలు తనకెందుకులే అనుకుంటే ఈ రోజు అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకునేవాళ్లం కాదు. స్వాతంత్ర్య అమర వీరుల్లో విప్లవాగ్ని రగిలేది కాదు. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకున్నాడు కాబట్టే అల్లూరి మనకు ఆరాధ్యుడయ్యారు’ అని చెప్పారు. ‘అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలి. అమరావతిలో కానీ మరెక్కడైనా కానీ, ప్రజలకు ద్రోహం చేయాలన్నా, వారి భవిష్యత్తును కాలరాయాలన్నా పాలకులు భయపడాలంటే 5 కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలి. అప్పుడే అమరావతి రూపంలో మన ఆత్మగౌరవం నిలబడుతుంది’ అని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/