స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు లో చంద్రబాబు అరెస్ట్

2015 స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను సీఐడీ అదుపులోకి తీసుకుంది. నంద్యాల పర్యటలో ఉన్న చంద్రబాబు..నగరంలోని RK ఫంక్షన్ హల్ లో బస చేయగా..శనివారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో పోలీసులు బలగాలు ఫంక్షన్ హల్ ను ముట్టడించి..ఉదయం 5 :30 గంటల ప్రాంతంలో చంద్రబాబు తో మాట్లాడి అరెస్ట్ కు సంబదించిన విషయాలు తెలిపారు.

ఆ తర్వాత చంద్రబాబు కు మెడికల్ టెస్ట్ లు చేసి అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును రోడ్డు మార్గంలో నంద్యాల, గిద్దలూరు,మార్కాపురం,త్రిపురాంతకం,వినుకొండ,నర్సరావుపేట, గుంటూరు మీదుగా విజయవాడ తీసుకుని వస్తున్నట్లు తెలుస్తోది. కాసేపట్లో సీఐడీ డీజీ మీడియా సమావేశం ద్వారా చంద్రబాబు అరెస్ట్ విషయం గురించి తెలుపనున్నారు.