రానున్న రోజులలో భారీ వర్షాలకు అవకాశం
వాతావరణశాఖ వెల్లడి

Visakhapatnam: వరుస అల్పపీడనాలతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులపాటు ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిందించింది.
ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
మరోవైపు తూర్పు-పడమర గాలుల వల్ల రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఇక రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/