కర్నాటక ఆలయంలో ముగ్గురు అర్చకుల హత్య
మాండ్య లో ప్రసిద్ధి చెందిన అరకేశ్వర ఆలయంలో దారుణం

కర్ణాటకలోని మాండ్య లో ప్రసిద్ధి చెందిన అరకేశ్వర ఆలయంలో దోపిడీకి వచ్చిన దొంగలు ముగ్గురు అర్చకులను అత్యంత దారుణంగా చంపేశారు.
హత్యకు గురైన అర్చకులను గణేశ్, ప్రకాశ్, ఆనంద్ లుగా గుర్తించారు. వారి తలలను బండరాళ్లతో చితక్కొట్టి ఉండడం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. దొంగలు హుండీల్లోని కరెన్సీ నోట్లను తీసుకుని చిల్లర అక్కడే వదిలివేశారు.
కాగా, ఆ ముగ్గురు అర్చకులు ఆలయ భద్రత కోసం అక్కడే నిద్రిస్తుంటారు. వారు నిద్రలో ఉండగానే దొంగలు ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు.
కాగా, హుండీలను దోచుకున్న దొంగలు గర్భగుడి తలుపులు కూడా బద్దలు కొట్టారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/