చాణక్యుడి ఆది హిందూ చతుర్వర్ణ వ్యవస్థ

తెలుసుకోండి చరిత్ర

Chanakkudu

మన పౌరాణిక కాలం నుండి, ఆ తరువాత ఇతిహాసాల కాలం నుండి మన భారతావనిలో ఎందరో మేధా వులు, రాజనీతిజ్ఞులు, రాజనీతి కోవిదులు ఉన్నారు.

రాజ్యాలను జనరంజకంగా పరిపాలించుటకు రాజులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చే మహామంత్రులను మనం ఎందరినో చూసాం

వారి గురించి చదివాం కూడా. కౌరవుల దగ్గర విదురుడు, కాక తీయ కాలంలో యుగంధురుడు, శ్రీకృష్ణదేవరాయల దగ్గర మహా మంత్రి తిమ్మరుసు- ఇలా ఎంతో మంది మహామేధావుల గురించి మనం విన్నాం.

కానీ మనకు ముందుకు గుర్తుకు వచ్చేది అద్వి తీయ మేధో సంపన్నుడు, వీరుడు, శూరుడు, ధీరుడు అయిన మగధ దేశం కాలంనాటి చాణక్యుడే.

క్రీ.పూ.371లో తక్షశిల దగ్గర జన్మించాడు చాణక్యుడు. చిన్నప్పటి పేరు ‘విష్ణుగుప్త కౌటిల్యుడు. పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ల అమ్మ ”నీకు పన్ను పక్కన అదనంగా ఇంకో పన్ను వచ్చి వికారంగా ఉంది నాన్నా! అన్నదట.

తరువాత బయటకు వెళ్లి ఓ రాయితో ఆ పన్నును ఊడగొట్టి, ఇంటికొచ్చి ”అమ్మా! ఇప్పుడు చూడు, బాగుందా? అని అడిగాడట.

రక్తం కారుతున్న కొడుకును చూసి ఆశ్చర్యపోయిందట. ఆ వయసులోనే చాణక్యుడి ధైర్య సాహ సాలు, శౌర్యం, గుండె నిబ్బరానికి, మనోనిగ్రహానికి మనకు ఆశ్చ ర్యం కలుగుతుంది.

ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాల యం, తక్షశిలలో చదువు పూర్తి చేసుకొని, ఆ విశ్వవిద్యాలయం లోనే చారిటి మెంబరుగా నియమించబడ్డాడు. మగధ సామ్రాజ్యా న్ని నందుడు పాలిస్తున్నాడు.

నందుడు ఏర్పాటు చేసిన ఒకానొక సమావేశంలో విశ్వవిద్యాలయం తరపున పాల్గొనడానికి చాణక్యు డు కూడా వచ్చాడు. అక్కడ నందుడు చాణక్యుణ్ణి అవమానిస్తాడు.

ఆ అవమానాన్ని భరించలేక అందరి ముందు ”నిన్ను నీ సామ్రా జ్యాన్ని కూకటివేళ్లతో కూలదోసి, నీ స్థానంలో మరొకరిని రాజుగా నియమిస్తాను అని శపథం చేస్తాడు. అంతవరకు ఈ శిగను ముడివేయనని అక్కడినుండి నిష్క్రమిస్తాడు.

ఏడు సంవత్సరాల నిరీక్షణ అనంతరం చంద్రగుప్తుని రాజుగా అనుకొని, రాజనీతిని ప్రబోధించి యుద్ధ చతురతలను, చాకచక్యాలను నేర్పి, సైన్యాన్ని ఏర్పర్చుకొని, నందుణ్ణి ఓడించి, ఆ స్థానంలో చంద్రగుప్తుణ్ణి చక్ర వర్తిగా చేస్తాడు.

అందుకే పగకు, ప్రతీకారానికి, పట్టుదలకు, శౌర్యా నికి, శూరత్వానికి, మారుపేరు చాణక్యుడు అని చెప్పవచ్చు.

ఇరవై సంవత్సరాలు చంద్రగుప్తుడు మగధ సామ్రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలించాడు అంటే దానికి కారణం చాణక్యుడే అని చెప్పవచ్చు.

మంత్రిగా ఉంటూ ఎప్పటిప్పుడు తన సలహాలను, సూచనలను చేస్తూ రాజనీతిని క్రోడీకరించి పరిపాలింపజేసాడు చాణక్యుడు. మంత్రిగా పదవీ విరమణ అనంతరం తన అనుభవాన్నంతా రంగరించి రెండు గ్రంథాలను రచించాడు చాణక్యుడు.

ఒకటి ‘చాణక్య నీతి, రెండవది ‘అర్థశాస్త్రం.చాణక్య నీతి గ్రంథంలో పరిపాలనా విషయాలు, ప్రజల మధ్య సంబంధాలు, బంధుత్వా లు, కులాలు, వ్యక్తులు మొదలైన మానవ సంబంధ విషయాలు ఎంతో కూలంకషంగా, వివరంగా, సహజంగా వివరించడం జరిగింది.

అందులోనే ఒక అధ్యాయం లో ఈ ”ఆది హిందూ చాతు ర్వర్ణ వ్యవస్థ గురించి సవివరంగా పేర్కొనడం జరిగింది. ఓ మానవ శరీరాన్ని ఉదాహరణంగా తీసుకు న్నాడు చాణక్యుడు.

నాలుగు భాగాలలో మొదటి తల. మానవ శరీరంమొత్తంలో అత్యంత ప్రధా నమైనది తలే కదా! ”నయ నం ప్రధానం అన్నారు. కళ్లు ఉండేవి తలలోనే కదా! నీరు, ఆహారాన్ని గ్రహించేది నోరు.

అంతే కాకుండా మాట్లాడేది నోరు. ఆ నోరు ఉండేది తలలోనే కదా! ఇక వాసన చూసే ముక్కు, వినికిడి గ్రహించే చెవులు తలలోనే కదా ఉండేవి. బయటకు కనబడేవే కాకుండా అత్యంత ప్రధానమైన మెదడు కూడా ఉండేది

తలలోనే కదా! ‘రిమోట్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ది బాడి అని మెదడును అంటాం. అగ్రకులాలైన బ్రాహ్మాణులు, రెడ్లు, కమ్మలు, కాపులు, రాజులు, కర్ణాలు, వెలమలు మొదలైన వారంతా ఈ తలగా పరిగణించ బడుతున్నారు. రెండవది కడుపు. ఎప్పటికప్పుడు కడుపు నింపు తూనే ఉండాలి.

ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం. ఇంక మధ్య మధ్యలో ఎన్నో చిరుతిండ్లతో కడుపును తృప్తి పరు స్తూనే ఉంచాలి. వైశ్యులను, వ్యాపారులను, వర్తకులను ఈ కడు పుగా పరిగణించబడుతున్నారు. ఇక మూడవది చేతులు.

మానవుని దైనందిన దినచర్యలో చేతులు చేసేనన్ని పనులు శరీరంలోని మరే అవయవాలు చేయవు. ఇంటికి వచ్చిన వ్యక్తికి చేతులతోనే నమస్కారం చేస్తాం.

కరచాలనం చేసేది చేతులతోనే. కాళ్లు కడు క్కోవడానికి చెంబుతో నీళ్లి చ్చేది చేతులతోనే. తుండుగుడ్డ ఇచ్చేది, తాగటానికి నీళ్లు ఇచ్చేది- ఇలా ప్రతిదీ చేసేది చేతులతోనే కదా.

అందుకే చేతులుగా పరిగ ణించబడే కులాలు చాలా ఎక్కువ. కమ్మరులు, కుమ్మరులు, పద్మ శాలీలు, కుట్టుపని చేసే దర్జీవాళ్లు, నాయిబ్రాహ్మణులు, రజకులు, కంసాలీలు, గొల్లకురుమలు, కంచా రులు-ఇలా ఎంతో మంది బల హీన వర్గాల కులస్తులు ఈ చేతు లుగా పరిగణించబడ్డారు.

ఇక నాలుగవది కాళ్లు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు తప్ప ఈ శరీరాన్ని మొత్తం మోసేవి కాళ్లే కదా! ముళ్లనక, రాళ్లనక, కొండలనక, చెత్తా చెదారంలో కూడా నడుస్తూ ఈ శరీరాన్ని ముందుకు నడిపేవి కాళ్లు. ఒక విధంగా చెప్పాలంటే వెట్టిచాకిరి చేసేవి.

దళితులు, బడుగు వర్గాల వాళ్లు, అట్టడుగు వర్గాలవాళ్లు ఈ కాళ్లుగా పరిగణించబడ్డారు. ఇదే చాణక్యుడి ‘ఆది హిందూ చాతుర్వర్ణ వ్యవస్థ. శతాబ్దాల కాలం గడిచిపోయింది. ఆధునిక పోకడలు ఏర్పడ్డాయి.

కాలక్రమేణ లోకం మారుతూ వచ్చింది. విద్యా,విజ్ఞాన, సాంఘిక, సామాజిక, రాజకీయ పరంగా ఎన్నో మార్పులు జరిగాయి.

అంతేకాకుండా అత్యంత అభివృద్ధి జరిగింది. కాళ్లుగ పరిగణించబడ్డ దళితులు,బడుగు వర్గాల, అట్ట డుగు వర్గాల వాళ్లు మార్పు, అభివృద్ధిచెంది తల భాగానికొచ్చారు. ఇది చాలా మంచి పరిణామం. యావత్తు ప్రపంచ దేశాలు ప్రశం సించే మన రాజ్యాంగం రచించిన డా. అంబేడ్కర్‌ దళితుడే కదా!

నీతి, నిజాయితో ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీ వయ్య దళితుడేగా! ప్రస్తుతం దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి దళితుడేకదా!

ఇలాఎంతో మంది దళితులు ఉన్నతమైన పదవులు అలంకరించి, మెప్పించి, అందరిచేత ప్రశంసలు పొందారు, పొందు తున్నారు కూడా.

ఇంకో శుభసూచకం ఏమిటంటే, అత్యం త నీచమైన అస్పృష్యత, అంటరానితనం దాదాపుగా అంతరించి పోయింది.

అయితే చేతులుగా పరిగణించబడ్డ బలహీన వర్గాల వాళ్లు, ముఖ్యంగా చేతివృత్తుల వాళ్లు అనుకున్నంత అభివృద్ధికి నోచుకోలేదు.

1956 నుండి ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల కు ఓ బి.సి. ముఖ్యమంత్రి కాలే కపోయాడు. ఇకముందు కూడా అవుతాడనే నమ్మకం లేదు.

మరి ఉండడానికి మాత్రం 53శాతం బి.సిలున్నారు. యాభైఏళ్ల క్రితం గ్రామాల్లో ఓ మాట తరచుగా వినబడేది.

”కుండలు చేసుకునే కుమ్మరివి నీకెందుకు రాజకీయం, గొడ్డళ్లు, కొడవళ్లు చేసుకునే కమ్మరివి నీకెందుకు రాజకీయం అని అగ్ర వర్ణాలవాళ్లు అనే వారు

అందుకే గ్రామాలలో బి.సి.లు చేతి వృత్తులు క్షీణించిపోవ డం చేత చావలేక బతకలేక ఉంటున్నారు.

ప్రభుత్వాలు కల్పిస్తున్న రిజర్వేషన్ల వల్ల కొంతవరకు బి.సిలు రాజ కీయాల్లో రాణిస్తున్నారు.కానీ సాంఘికంగా,సామాజికంగా,ఆర్థికంగా ఇంకా ఎదగవలసి ఉంది.

ఓ బి.సి. ఈ దేశానికి ప్రధాన మంత్రి కావడానికి 67 ఏళ్ల సుదీర్ఘమైన సమయం పట్టింది.

-మునిగంటి శతృఘ్నచారి
(రచయిత: కార్యదర్శి బిసి సంఘం, తెలంగాణ)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/