కేసీఆర్ , కేటీఆర్ లను తిట్టడానికి వాడెవ్వడు అంటూ రేవంత్ ఫై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి – మల్లారెడ్డి ల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గత వారం రోజులుగా ఇద్దరు సైలెంట్ గా ఉండేసరికి వీరి గొడవ సద్దుమణిగిందని అంత అనుకున్నారు కానీ మరోసారి మల్లారెడ్డి ..రేవంత్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.

జవహర్ ‌నగర్‌లో టీఆర్‌ఎస్‌లో చేరికల సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ , కేటీఆర్ లను తిట్టడానికి వాడెవ్వడు అంటూ రేవంత్ ఫై విరుచుకపడ్డారు. ‘మన సీఎం మహాత్ముడు.. గొప్పమనసు.. గొప్పనాయకుడు, ప్రేమ ఉన్నోడు.. మనకోసమే ఆలోచన చేస్తాడు రాత్రీపగలు.. అలాంటి సీఎంని పట్టుకుని తిడతాడా? పురుగులపడి చచ్చిపోతాడు’ అంటూ శాపనార్థాలు పెట్టారు. యాభై కోట్లు పెట్టుకుని పీసీసీ కొనుక్కున్నోడు.. చర్లపల్లి జైలుకెళ్లొచ్చినోడంటూ రేవంత్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. గత పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని.. ఏం చేశారని ప్రశ్నించారు. కరెంటు ఇచ్చారా? నీళ్లు ఇచ్చారా? అని నిలదీశారు. మన సీఎంని తిట్టడానికి వాడెవ్వడని ఆగ్రహం వ్యక్తం చేశారు.