ఫ్లిప్‌ కార్ట్‌ సీఎఫ్‌ఓ రాజీనామా

కొత్త సీఎఫ్ఓగా శ్రీరామ్ వెంకటరమణ నియామకం

flipkart
flipkart

ముంబయి: ఈకామర్స్ దిగ్గజం, వాల్ మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్ కార్ట్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా విధుల్లో ఉన్న ఎమిలీ మెక్ నీల్ రాజీనామా చేశారు. దీంతో ఆసంస్థ కొత్త సీఎఫ్ఓగా శ్రీరామ్ వెంకటరమణను నియమించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై శ్రీరామ్, వాల్ మార్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఓ క్రిస్ నికోలస్ కు రిపోర్ట్ చేస్తారని పేర్కొంది. ఫ్లిప్ కార్ట్, మింత్రాలకు సంబంధించిన పన్ను చెల్లింపు వ్యవహారాలు, రిస్క్ మేనేజ్ మెంట్, ట్రెజరీ తదితర కార్యకలాపాలను నిర్వహిస్తారని సంస్థ పేర్కొంది. కాగా ఎమిలీ మెక్ నీల్ 2018 నుంచి ఫ్లిప్ కార్ట్ లో గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా విధుల్లోఉన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/