623 జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

తదుపరి విచారణ 19 కి వాయిదా

ap high court
ap high court

అమరావతి: ఏపిలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలంగించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఏపిలోని ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రంగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం 623 జీవో ను తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలకు మట్టి రంగు చేర్చాలని ప్రకటించింది. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టులో మరోసారి పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను విచారించిన న్యాయస్థానం 623 జీవో ను నిలిపివేస్తు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19 కి వాయిదా వేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/