ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలంటూ మోసం!

అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన

Online liquor sales (file)

ఆన్‌లౌన్‌ మోసగాళ్లు చివరికి లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపివేయటంతో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు అంటూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.

ఖ్యూఆర్‌ కోడ్‌, లేదా లింక్‌ పంపటం దానికి నగదు పంపిన వెంటనే మీ ఆర్డర్‌ మీ ఇంటి ముందుకే ఉంటుంది అంటూ సైబర్‌నేరగాళ్లు ఈ మద్యకాలంలో సోషల్‌ మీడియాలో అసత్యప్రచారం జోరుగా సాగుతోంది..

మరీముఖ్యంగా ఇంటర్నెట్‌ ద్వారా కొనఇన ప్రాంతాల్లోని వైన్‌షాప్‌, లేదా బార్‌ చిత్రాలను సేకరించి పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు.

ముందుగా, కొంత మొత్తం చెల్లిస్తే మిగిలిన సొమ్ము ఆర్డర్‌ డెలివరీ సమయంలో ఇస్తేసరిపోతుంది అంటూ వారు ముఱ్యంగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో వారు చేసఉతన్న ప్రకటనలు చూసి ఆకర్షణకు గురైనవారు వారు ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌చేయటంతో మోసానికి గురవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.


వివరాల్లోకి వెళితే.. విజయవాడ ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో మద్యం కోసం వెతకటం జరిగింది..

ఆ వ్యక్తికి ఆన్‌లైన్‌లో ఓ ఫోన్‌ నెంబర్‌ లభించటంతో ఆ నెంబర్‌లో మద్యం విషయమై సంప్రదించటంతో అవతలి వ్యక్తి నగదు చెల్లిస్తే వెంటనే మీకు మద్యం అందుతుంది..

అని తెలిపటంతో ఆ మాటలు నమ్మి మోసగాడు చెప్పిన అకౌంట్‌లో రూ.5వేలు చెల్లించటం జరిగింది. అయితే ఎంతకీ తను చేసిన ఆర్డర్‌ అందకపోవటంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేయటం జరిగింది.. సదరు ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

. ఫేస్‌బుక్‌ నోడల్‌ ఏజన్సీతో సంప్రదింపులు జరిపి ఇటువంటి నకిలీ అకౌంట్‌, పేజీలు సృష్టించిన వారి వివరాలు సేకరించి తగు చర్యలు తీసుకోవటం జరుగుతోంది.

ప్రాథమికంగా లభించిన సమాచారాన్ని బట్టి ఈ గ్యాంగ్‌ రాజస్థాన్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించటం జరిగింది.

ఇదే విధంగా గతంలో రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ఏర్పాటుచేసిన సమయంలో విజయవాడ మాచవరంకు చెందిన ఒక వ్యక్తి మద్యం కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌చేయగా లభించిన నెంబర్‌ను సంప్రదించటం జరిగింది.

. ఆ క్రమంలో ఆ వ్యక్తి రూ.30వేలు చెల్లించటం జరిగింది. ఎంతకీ మద్యం డెలివరీ కాకపోవటంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది..

ఫిర్యాది నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు ఆ కేసులో దర్యాప్తు చేసి బాధితుడు మోసపోయిన రూ,.30వేలను అతనికి అందించటం జరిగింది.

కావున మోసపూరిత ప్రకటనపై ఆకర్షితులు కావొద్దని, సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిఘా ఉంచటం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

ఈ తరహా మోసాలు చేసత్న్న మోసగాళ్లు వివిధ రకాల పేర్లతో సోషల్‌మీడియాలో అకౌంట్లు తెరవటం జరుగుతోందని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మద్యం పాలసీలో డోర్‌ డెలివరీ వాటి విధానంలేదని పేర్కొన్నారు.

ఇటువంటి ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు యంత్రాంగం సూచిస్తోంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/