మరిన్ని చైనా యాప్‌లను నిషేధం విధించనున్న కేంద్రం!

దీనిపై పనులు ప్రారంభించిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ

Centre-to-ban-280-more-china-apps

న్యూఢిల్లీ: ఇటివల భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరిన్ని యాప్‌లను బ్యాన్ చేసే అంశంపై ప్రభుత్వం యోచిస్తుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో చైనాకు చెందిన లక్షలాది యాప్‌లు ఉన్నాయి. భారత్‌లో ప్రజాదరణ పొందిన మరో 280 చైనా యాప్‌లపై కూడా నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైతున్నట్లు తెలిసింది. చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గుర్తిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన పబ్‌జీని కూడా బ్యాన్ చేయాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. 280 యాప్‌లపై ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ నిఘా పెట్టినట్లు తెలిసింది. ఆ యాప్‌ల ద్వారా సమాచారం ఎలా మారుతుందన్న అంశంపై వివరాలు సేకరిస్తోంది. 20 యాప్‌ల ద్వారా జరుగుతున్న డేటా మార్పిడిపై నిపుణులు సమాచారం సేకరించినట్లు తెలిసింది. చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్‌లను బ్యాన్ వేసే యోచనలో ఉంది. కాగా, ఇప్పటికే 59 చైనా యాప్‌ల నిషేధం విధించడంపై చైనా స్పందిస్తూ.. భారత చర్య తమని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. చైనాను దారిలోకి తీసుకురావాలంటే ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భారత్ భావిస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/