తెలంగాణలో ధాన్యం కొనుగోలు ఫై కేంద్రం కీలక ప్రకటన..

తెలంగాణ ధాన్యం కొనుగోలు ఫై గత కొద్దీ రోజులుగా రాష్ట్ర సర్కార్ కు బిజెపి కి మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ వార్ కొనసాగుతుంది. ఈ తరుణంలో పార్లమెంట్ లో ధాన్యం కొనుగోలు ఫై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

2020-21 రబీ సీజన్ లో తెలంగాణ నుంచి 55 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని టార్గెట్ పెట్టుకుంటే 61.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కేంద్రం తెలిపింది. మిగుల బియ్యం తీసుకోవాలని తెలంగాణ కోరడంతో టార్గెట్ కు మించి తీసుకున్నామని కేంద్ర వెల్లడించింది. తెలంగాణలో ఈ ఖరీఫ్ లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆగస్టు 17న జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. టీఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వర రావు, మాలోత్ కవిత, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానమిచ్చారు.