మెగా , నందమూరి ఫ్యాన్స్ కు భారీ షాక్

మెగా , నందమూరి ఫ్యాన్స్ కు భారీ షాక్

మెగా , నందమూరి అభిమానులంతా వెయ్యి కళ్లతో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో డిసెంబర్ 03 న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి వారిలో ఆనందం నింపారు చిత్ర యూనిట్. కానీ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సినీ గేయ రచయిత సిరివెన్నెల తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ లోకం దిగ్బ్రాంతి లో ఉంది. ఈ తరుణంలో ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగోదని చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సిరివెన్నెల దోస్త్ అనే పాటకు లిరిక్స్ అందించారు. ఈ పాట రీసెంట్ గా విడుదలై ప్రేక్షకులను , సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ కావడంతో ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరీస్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. జనవరి 07 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.