తెలుగు తెరపై డేవిడ్ వార్నర్ కనిపిస్తాడా..?

ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రికెట్ అభిమానులకే కాదు నెటిజన్లను కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్‌ కారణంగా భారత్‌లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వార్నర్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. 2021 సీజన్ వరకు సన్‌రైజర్స్ తరఫున ఆడిన వార్నర్‌ను భారత్‌లోని అభిమానులు ముద్దుగా డేవిడ్ భాయ్ అని పిలుస్తుంటారు. ఆటతోనే కాకుండా.. ఇన్‌‌స్టాగ్రామ్ రీల్స్‌తోనూ వార్నర్ తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు. టాలీవుడ్ హీరోల తాలూకా సినిమాల్లోని సాంగ్స్ కు , డైలాగ్స్ కు రీల్స్ తో మరింత చేరువయ్యాడు. ఇక ఇప్పుడు తెలుగు సీనియాల్లో నటిస్తే బాగుంటుందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా తెలిపి అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది.

వార్నర్ క్రికెట్ నుంచి రిటైర్ అయితే.. తెలుగు సినిమాల్లో నటించడమే అతడికి బాగా సెట్ అవుతుందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ చూసిన వార్నర్.. లాఫింగ్ ఎమోజీలతో బదులిచ్చాడు. దీనికి నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. డేవిడ్ భాయ్ తగ్గేదేలే అని ఓ నెటిజన్ రిప్లయ్ ఇవ్వగా.. మరో నెటిజన్ డేవిడ్ పుష్ప వార్నర్ అని ట్వీట్ చేశాడు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇష్టపడే ఆటగాడు డేవిడ్ వార్నర్. అతణ్ని తెలుగులోని బిగ్ స్టార్లతో కలిసి స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో’ అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పుష్పలో గెస్ట్ రోల్ చేయొచ్చు డేవిడ్ భాయ్ అంటూ మరో నెటిజన్ సలహా ఇచ్చాడు. మరి డేవిడ్ వార్నర్ నిజంగానే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి.