బెంగాల్‌కు కేంద్ర బలగాలు

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలుకు ముందే రాక

Central forces to Bengal
Central forces to Bengal

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే పశ్చిమబెంగాల్‌కు ఈ వారంలో కేంద్ర భద్రతా బలగాలు రానున్నాయి. అయితే ఆ బలగాలు వచ్చే కచ్చితమైన తేదీలు ప్రకటించాల్సి ఉంది. రాZషంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా శాంతిభద్రతలను నిర్వహించడానికి ఈ నెల 25 కల్లా కనీసం 125 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలు చేరుకోనున్నాయి.

ఎన్నికల సంఘం అధికారుల మేరకు.. 60 కంపెనీల సిఆర్‌పిఎఫ్‌, 30 కంపెనీల ఎస్‌ఎస్‌బి, 25 కంపెనీల బిఎస్‌ఎఫ్‌, 5 కంపెనీల చొప్పున సిఐఎస్‌ఎఫ్‌, ఐటిబిపి బలగాలు రాZషానికి చేరుకోనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే వివిధ రకాల బలగాలు శాంతిభద్రతల నిర్వహణ నెపంతో రాZషానికి చేరుకోనుండడంపై రాZష యంత్రాంగం ఆశ్చర్యానికి లోనైంది.

కేంద్ర భద్రతా బలగాల ఒక్కో కంపెనీలో 80 నుంచి 100 మంది ఉంటారని, దానికి ఓ అసిస్టెంట్‌ కమాండెంట్‌ నేతృత్వం వహిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం పంపించే భద్రతా బలగాలకు అయ్యే ఖర్చంతా రాZషప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. భద్రతా బలగాల మొహరింపునకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పశ్చిమబెంగాల్‌ ప్రధాన ఎన్నికల అధికారి రాZష ప్రభుత్వానికి పంపించారు. ఇదే సమాచారాన్ని జిల్లా అధికారులకు కూడా తెలియచేయాలని ఆయన సూచించారు. కాగా కేంద్రం నుంచి తరలివచ్చే భద్రతా బలగాలను రాZషంలోని అన్ని జిల్లాల్లోనూ మొహరించాలని ఆయన ఆదేశించారు. గతంలోనైతే ఎన్నికల తేదీలు ఖరారై ప్రకటించిన తర్వాత కొన్ని కంపెనీల కేంద్ర బలగాలను రాZషానికి పంపించేవారు.

2016లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా తేదీలు ప్రకటించిన తర్వాత దాదాపు 30 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలను నియోగిస్తే, 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా తేదీలు ప్రకటించిన తర్వాతనే దాదాపు 40 కంపెనీల భద్రతా బలగాలు రాZషానికి చేరుకున్నాయి. అయితే ఈసారి మాత్రం ఎన్నికల సంఘం ఇంతవరకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించకపోవడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/