అంగారక గ్రహంపై నది, సరస్సు!

ఫొటోలు పంపిన అమెరికా పెర్సిరోవర్‌

River, lake on Mars!
River, lake on Mars!

Washington: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు ఉద్దేశించి పర్సవరన్స్‌ రోవర్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయింది. 2020, జూలైలో ప్రారంభమైన ఈ సుదీర్ఘయాత్ర విజయవంతం కావడం అంతరిక్ష శాస్త్రవేత్తలకు శుభవార్తే. ఈ క్రమంలో నాసా.. రోవర్‌ పర్సవర్సన్‌ పంపించిన అరుదైన ఫొటోలను షేర్‌ చేసింది.

వీటిలో రోవర్‌ కేబుల్స్‌ సాయంతో అరుణగ్రహంపై ల్యాండ్‌ అయిన ఫొటో కూడా ఉంది. ల్యాండ్‌ అయ్యే సమయానికి ఆరు ఇంజన్లు ఉన్న ఈ రోవర్‌ తన వేగాన్ని గంటకు 1.7 మైళ్లకు తగ్గించుకుని అరుణగ్రహంపై ల్యాండ్‌ అయినట్లు నాసా వెల్లడించింది. రోవర్‌ అరుణగ్రహం ఉపరితలం మీద ల్యాండ్‌ అయినప్పుడు అక్కడ దుమ్ము లేవడం వీటిల్లో కనిపిస్తుంది అని రోవర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ తెలిపారు. రోవర్‌ తన మొట్టమొదటి హై-రిజల్యూషన్‌, కలర్‌ పొటోను అప్‌ లోడ్‌ చేయ గలిగింది.

ఇది జెజెరో క్రేటర్‌లో అడుగుపెట్టిన చదునైన ప్రాంతాన్ని చూపిస్తుంది. ఇక్కడ బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక నది, లోతైన సరస్సు ఉనికిలో ఉన్నాయనే ఆనవాల్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రెండవ కలర్‌ ఫొటోలో రోవర్‌ ఆరు చక్రాలలో ఒకటి కనిపిస్తుంది. దాని పక్కనే అనేక రాళ్లు ఉన్నాయి. ఇవి 3.6 బిలియన్‌ సంవత్సరాల కన్నా పురాతనమైనవిగా భావిస్తున్నాం అంటూ నాసా ట్వీట్‌ చేసింది.

ఈ రాళ్లు అగ్నిపర్వత లేదా అవక్షేప మూలాన్ని సూచిస్తాయా అనేది తేలాల్సింది. రోవర్‌ భూమి మీదకు వచ్చినప్పుడు తనతో పాటు తీసుకువచ్చే ఈ రాళ్లను పరీక్షించి అవి ఏ కాలానికి చెందినవి. ఏ రకానికి చెందినవి అనేది తేలుస్తాం అన్నారు.

పర్సవర్సన్‌ కొన్ని ఫొటోలను పంపింది. అవి బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్నాయి. అంత క్లారిటీగా లేవు. ఇప్పుడు వచ్చిన ఫొటోలు చాలా బాగా ఉన్నట్లు నాసా వెల్లడించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/