రజనీతో కమల్‌ చర్చలు

రాజకీయ భేటీ కాదన్న సన్నిహితులు!

Kamal Haasan meets Rajanikanth

Chennai: తమిళ సీనియర్‌ నటుడు, మక్కల్‌ నీధి మైయం(ఎమ్‌ఎన్‌ఎమ్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ శనివారం మరో తమిళ్‌ సీనియర్‌ నటుడు రజనీకాంత్‌ని కలిశారు. రజనీ కాంత్‌ కొన్ని వారాల క్రితం తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన తర్వాత కమల్‌ రజనీని కలవడం ఇదే మొదటిసారి.

2021లో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో కమల్‌ హాసన్‌ బిజీగా ఉన్న తరుణంలో తలైవాని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వారిరువురూ రాజకీయాల గురించి చర్చించలేదని వారి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అని ఇంగ్లీష్‌ మీడియా పేర్కొంది.

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ గత సంవత్సరం చివరలో రజనీకాంత్‌ ఒక ప్రకటన కూడా చేశారు. అంతకు ముందే తన అభిమాన సంఘాల సమాఖ్యను ప్రజాసేవారంగంలో పాల్గొనేలా చేశారు.

అయితే డిసెంబరులో హటాత్తుగా ఆయ న ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రి పాలు కావడంతో, ఆస్పత్రి నుంచి డిస్‌చార్జి అయిన తర్వాత తాను రాజకీయాల్లోకి రావడానికి ఆరోగ్యం సహకరించ నందువల్ల ఆ ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయనను నమ్ముకున్న అభిమానులు రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఒత్తిడి తెస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు.

తనపై ఒత్తిడి తేవద్దనీ, అలా చేసి తన ను బాధించవద్దని రజనీ అనడంతో అభిమాన సంఘాల వారు ఇతర పార్టీల్లో చేరడం ప్రారం భించారు. ఇందుకు రజనీ కానీ, ఆయన అభి మాన సంఘాల సమాఖ్య వ్యవహారాలు చూసే పెద్దలు కానీ అభ్యంతరం తెలియ చేయలేదు. వారికి ఇష్టమైన పార్టీ కోసం వారు పాటు పడవచ్చని తేల్చి చెప్పారు.

అయితే తన చిరకాల మిత్రుడు రజనీని తనకు మద్దతు తెలపాలని కోరాలని ఆలోచిస్తున్న కమల్‌ హాసన్‌కి రజనీ అభిమానులు వేరే పార్టీల్లో చేరడం కాస్త కలవరపాటుకి గురిచేసింది. రజనీ రాజ కీయాల్లోకి రానన్నాడు కాబట్టి తనకు మద్దతు ఇస్తాడని ఆయన ఎంతో ఆశతో ఉన్నారని ప్రచారం జరిగింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/