ఏపిలో నేటి నుండి మద్యం షాపులు

భారీగా పెరిగిన మద్యం ధరలు

Wine Shops
Wine Shops

అమరావతి: ఏపిలో నేటి నుండి మద్యం దకాణాలు తెరుచుకోనున్నాయి. ఈనేపథ్యంలో సిఎం జగన్‌ ఆధ్వర్యంలో నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో మద్యం ధరలను 25 శాతం మేర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం అమ్మకాలు కొనసాగనున్నాయి. దుకాణాల వద్ద రద్దీ లేకుండా, వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు, బార్లు, క్లబ్బులు, ఏపీటీడీసీ లిక్కర్ లైసెన్స్‌తో నడిచే కేంద్రాలను తెరిచేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. మద్యం విక్రయాలపై అదనపు సర్‌చార్జీ విధిస్తున్నామని, ఫలితంగా మద్యం ధరలు పెరుగుతాయని అన్నారు.

మద్యం ధరలు… కొత్త ధరలు ఇలా

లైట్ బీర్ ధరను రూ. 20, స్ట్రాంగ్ బీర్ ధరను రూ. 10 మేరకు పెంచింది. క్వార్టర్ బాటిల్ పై రూ. 20, హాఫ్ బాటిల్ పై రూ. 40, ఫుల్ బాటిల్ పై రూ. 80, ఫారిన్ లిక్కర్ బాటిల్ పై రూ. 150 చొప్పున ధరలను పెంచారు. ఇప్పుడు స్టాక్ ఉన్న మద్యాన్ని పాత ధరలకే విక్రయించాలని, కొత్త ఎమ్మార్పీ ధరలు ముద్రించినవి మార్కెట్లోకి వచ్చిన తరువాత మాత్రమే కొత్త ధరలు అమలులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు. కాగా అన్ని రకాల బ్రాండ్లపై 20 శాతం వరకూ ధరలను పెంచింది. దీంతో రాష్ట్రానికి ఏటా రూ. 4 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/