వైస్సార్సీపీ మంత్రుల ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన బిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్

బిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్..ఏపీ అధికార పార్టీ మంత్రుల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీలో ఏమీ చదువుకోని వారికీ మంత్రుల పదవులు ఇచ్చారని మండిపడ్డారు. కనీస అవగాహన లేని వారికి మంత్రి పదవులు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం అన్ని అంశాలపై పట్టుకున్న వారికి మాత్రమే పదవులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల ఫై ఏపీ మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.

అలాగే తెలంగాణ లో పొత్తుల ఫై కూడా శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కొందరు పొత్తులపై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తాము సీఎం కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని అన్నారు. బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేస్తుందని, తమకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ను ఆ పార్టీ ఆ బాధ్యతల నుంచి తొలగించడం వారి పార్టీ నిర్ణయమని చెప్పారు. ఆయా అంశాలతో తమకే సంబంధం ఉండదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ నుంచి కూడా బీఆర్ఎస్ లో పలువురు నేతలు చేరిన విషయం తెలిసిందే. ఏపీలో చాలాకాలంగా పనులు జరుగుతున్న పోలవరం ప్రాజెక్టుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పోలవరం విషయంలో కేసీఆర్ ఎవ్వరికీ నష్టం కలగకుండా పనులు పూర్తి చేయిస్తారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.