మనీష్ సిసోడియాపై సీబీఐ మరో అవినీతి కేసు

CBI’s Fresh Corruption Case Against Jailed AAP Leader Manish Sisodia

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై మరోకేసు నమోదైంది. ఢిల్లీ ఫీడ్ బ్యాక్ యూనిట్ కేసులో సీబీఐ ప్రస్తుతం జైల్లో ఉన్న మనీష్ సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోడియాతో సహా మొత్తం ఏడుగురిపై సీబీఐ కేసు ఫైల్ చేసింది. అవినీతిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ యూనిట్ “పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లా పనిచేసిందని ప్రాథమిక విచారణలో గుర్తించింది.

2015లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని, అయితే దీనిపై ఈ సర్క్యులేట్ కూడా విడుదల కాలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరోపించింది. ఎఫ్‌బీయూలో నియామకాల కోసం లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొంది. “ఫీడ్‌బ్యాక్ యూనిట్ తప్పనిసరి సమాచారం సేకరించడంతో పాటు, రాజకీయ నిఘా, ఇతర అంశాలపై దృష్టి పెట్టిందని సీబీఐ తన ప్రాథమిక విచారణ నివేదికలో స్పష్టం చేసింది. ఎఫ్‌బీయూలో అవకతవకలను గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం సూచన మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ చేసి..మనీష్ సిసోడియా సహ ఏడుగురిపై కేసు నమోదు చేసింది.