హైదరాబాద్ అంత చల్లచల్లగా మారింది

రెండు తెలుగు రాష్ట్రాల్లో నాల్గు రోజుల పాటు వర్షాలు పడనున్న నేపథ్యంలో వాతావరణం అంత మారిపోయింది. నిన్నటి వరకు తీవ్ర ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవ్వగా..ఉదయం నుండి వాతావరణం అంత చల్లగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు ఈ చల్లదనాన్ని తెగ ఆస్వాదిస్తున్నారు. సిటీలో అక్కడక్కడ చిరు జల్లులు పడుతుండగా, సిటీ శివార్లలో కొన్ని చోట్ల వర్షం పడుతుంది. ఉక్కబోతతో అల్లాడిన నగరవాసులు.. రిలాక్స్ అయ్యారు. మేఘాలు కమ్మేయటంతో సాయంత్రం అయ్యిందా అనే ఫీలింగ్ ఏర్పడింది వాహనదారులకు.

15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో ఈ వర్షాలు ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణ శాఖ చెప్పినట్లే.. మార్చి 16వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ సిటీలో వాతావరణ మారిపోయింది. ఎండపోయి.. చల్లటి గాలులు వీస్తున్నాయి. అటు ఏపీలోనూ పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి.