ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మ‌నీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు

Manish Sisodia-No IPL, Other Sports Event In Delhi
CBI raids at residence of Dy CM Manish Sisodia, other locations

న్యూఢిల్లీః ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మ‌నీష్ సిసోడియా ఇంట్లో ఈరోజు సీబీఐ సోదాలు నిర్వ‌హించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల కేసులో ఈ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఢిల్లీలోని సుమారు 20 ప్ర‌దేశాల్లో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి. సీబీఐ అధికారులు త‌న ఇంటికి వ‌చ్చిన‌ట్లు మ‌నీష్ సిసోడియా నేడు త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ద‌ర్యాప్తు సంస్థ‌కు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. వాళ్ల‌కు త‌న వ‌ద్ద ఏమీ దొర‌క‌ద‌ని కూడా సిసోడియా వెల్ల‌డించారు. దేశం కోసం మంచి ప‌నులను చేసేవాళ్ల‌ను వేధించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యా రంగంలో తాను చేస్తున్న ప‌నిని ఎవ‌రూ ఆప‌లేర‌న్నారు. నిజం నిల‌క‌డ‌గా తెలుస్తుంద‌ని సిసోడియా ట్వీట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/