ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫై బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు చేసారు. 800 షాపులకు కవితనే లిక్కర్ సరఫరా చేసిందని , కవిత ‘లిక్కర్ క్వీన్’ అని, లిక్కర్ పాలసీలో భాగంగా 32 రూపాయలుగా ఉన్న కమీషన్ ను 340 రూపాయలకు పెంచారని విమర్శలు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో యువకులు, తెలంగాణ జాగృతికి చెందిన మహిళలు వివేక్ సమక్షంలో బీజేపీలో చేరారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం ఏర్పాడ్డాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని కల్వకుంట్ల కమిషన్ రావుని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న వివేక్… మిషన్ భగీరథలో 40 వేల కోట్లు మెగా కృష్ణారెడ్డి తో కలిసి కేసీఆర్ దోచుకున్నాడని ఆరోపించారు. ప్రజల బతుకులను ఆగం చేసిన బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని వివేక్ పిలుపునిచ్చారు. కవిత ‘లిక్కర్ క్వీన్’ అని ఆరోపించారు. 800 షాపులకు కవితనే లిక్కర్ సరఫరా చేశారని విమర్శించారు. లిక్కర్ పాలసీలో భాగంగా 32 రూపాయలుగా ఉన్న కమీషన్ ను 340 రూపాయలకు పెంచారని ఆరోపించారు.