మరోసారి ఎంపి అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు

ys-avinash-reddy

అమరావతిః కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా విచారణ చేస్తున్న సీబీఐ ఇప్పుడు ఎంపీ అవినాశ్ కు నోటీసులు ఇచ్చింది. తొలుత ఈ రోజు విచారణకు రావాలంటూ నోటీసులు జారీ ఇవ్వగా, ఎంపీ అవినాశ్ తనకు అయిదు రోజల సమయం కావాలని కోరుతూ లేఖ రాసారు. దీంతో..ఇప్పుడు ఈ నెల 28న హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఎంపీ అవినాశ్ కు నోటీసులు పంపారు. ఇప్పటికే ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పరిధిలో ప్రారంభమైంది. పులివెందుల కోర్టు కేసుకు సంబంధించిన అన్ని వివరాలు తెలంగాణ హైకోర్టుకు చేరుకున్నాయి. ఇప్పుడు ఎంపీ అవినాశ్ విచారణ ఈ కేసులో కీలక మలుపుగా కనిపిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/