యాదాద్రి పేరును మ‌ళ్లీ యాద‌గిరి గుట్ట‌గా మారుస్తాంః మంత్రి కోమ‌టిరెడ్డి

komatireddy-venkat-reddy

హైదరాబాద్‌ః మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి శుక్ర‌వారం మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బిఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కెసిఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కెసిఆర్‌ చేసిన పాపాలే ఆయ‌న‌కు చుట్టుకున్నాయ‌న్నారు. ఇంకా మంత్రి కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ.. యాద‌గిరిగుట్ట పేరును మార్చ‌డ‌మే కెసిఆర్‌ చేసిన మొద‌టి త‌ప్పు అని అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్‌ చేసిన పాపాల వ‌ల్ల క‌రువు వ‌చ్చింద‌న్నారు. అలాగే యాద‌గిరి గుట్ట‌లో భారీ స్కామ్ జ‌రిగింద‌ని మంత్రి ఆరోపించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత విచార‌ణ చేస్తామ‌ని తెలిపారు. అంతేగాక‌ యాదాద్రి పేరును మ‌ళ్లీ యాద‌గిరి గుట్ట‌గా మారుస్తామ‌ని చెప్పారు. గేట్లు తెర‌వ‌క‌ముందే కాంగ్రెస్‌లోకి తోసుకుని వ‌స్తున్నార‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చెప్పుకొచ్చారు.