ట్రంప్‌కు మోడి ఫోన్‌..పలు అంశాలపై చర్చ!

ఇరు దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బలపడిందన్న మోడి

Trump-modi
Trump-modi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో పలు అంశాలపై మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం ఈరోజు ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా, భారత్ మ‌ధ్య బంధం మ‌రింత బలపడినట్లు మోడి చెప్పారు. ట్రంప్‌తో పాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు, అమెరికా ప్ర‌జ‌ల‌కు మోడి నూతన సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. వారు ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నట్లు మోడి అన్నారు. పలు అంశాల్లో క‌లిసి ప‌నిచేసేందుకు ట్రంప్, మోడి సానుకూలంగా స్పందించారు. ఇరు దేశాల మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతోందని మోడి వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్ కూడా ఈ సందర్భంగా భార‌త ప్ర‌జ‌ల‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భార‌త్ పలు రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి ప‌ట్ల ట్రంప్ హర్షం వ్య‌క్తం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు తాము సిద్ధమని ట్రంప్ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/