బయటకు వెళ్లాలంటే భయం!

మనస్విని .. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం

Fear of going out
Fear of going out

మేడమ్‌. నాకు ఈ మధ్య చాలా ఆందోళనగా ఉంటోంది. బయటకు వెళ్లాలంటే భయం. ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతున్నాను. ఈ బాధల నుండి బయటపడటంఎలా? శారీరక ఆరోగ్యం కూడా పాడయిపోతుంది. నాకు తెలిసిన వారికి ఒక పెద్ద జబ్బుచేసింది. అది చూసి ఇలా తయారయ్యాను. ఏంచేస్తే నేను బాగవుతాను? చెప్పండి ప్లీజ్‌. – శ్రీజ, హైదరాబాద్.

మీరు తప్పక బయటపడగలరు. భయంవద్దు. ఆందోళన వద్దు. సానుకూల ఆలోచనలు చెయ్యాలి. అనుమానాలు వద్దు.

అనుమానవే పెనుభూతం అందువల్ల ఆనందంగా ఉండండి. సందేహాలుంటే నివృత్తి చేసుకోండి. సమ యాన్ని ఆనందంగా గడపండి. ప్రశాంతత అవసరం.

కోర్కెకాదు. తగిన విశ్రాంతి తీసుకోండి. మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి కాలక్షేపం చాలా అవసరం. స్నేహితులతో చక్కని సంభాషణలు చేయవచ్చు.

యోగ, ధ్యానంతో ప్రశాంత జీవనశైలితో సమయాన్ని గడపండి. ప్రకృతితో ఉండండి.

చెట్లు, చెమలు మంచి మంచి దృశ్యాలతో జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి. మంచిమంచి సందేశాలున్న పుస్తకాలు చదవండి.

సత్పురుషుల బోధనలువినండి. ఎంతో మార్గదర్శకాన్ని పొందుతారు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటానికి శాయిశక్తులా ప్రయత్నం చేయ్యండి.

దుఃఖాన్ని దరికి చేరనీయవద్దు. భయాన్ని పోగొట్టుకోవడానికి శాయిశక్తులా ప్రయత్నం చెయ్యండి. జబ్బులు వస్తే, వైద్యుల సంప్రదింపుల ద్వారా నయం అయిపోతాయి.

అందువల్ల జబ్బుల గురించి భయంవద్దు. ఆందోళన వల్ల హాని జరుగుతుంది. అందువల్ల భయాందోళనలు కలిగించే వాటికి దూరంగా ఉండాలి.

సంతృప్తినిచ్చే, ఆహ్లాదాన్నిచ్చే పనులు చేయాలి. ప్రతిక్షణం విలువైంది వర్తమానంలో జీవించాలి. భవిష్యత్‌ గురించి ఆందోళన వద్దు. గతం గురించి ఆలోచించవద్దు.

ప్రతి రోజూ ఆనందంగా గడపాల్సిందే.

మేడమ్‌, నా వయస్సు 60 సంవత్సరాలు, నేను ఈ మధ్యనే పదవీ విరమణ చేసాను. నాకు ఏం తోచటం లేదు. పెద్ద ఉద్యోగం నుండి రిటైర్‌ అయ్యాను. మంది మార్భలం ఉండేది. ఇప్పుడవి ఏమీ లేవు. ఇంకో ఉద్యోగం చేసుకుందామంటే, చిన్న ఉద్యోం చేయ్యలేను. సఏం చేస్తే నేను మరల నేను మామూలుగా ఉండగలను? కొంచెం వివరించండి – సౌజన్య, విజయవాడ

మీరు తప్పక మామూలుగా ఉండగలరు. సానుకూలంగా ఆలోచించండి. ఇప్పుడు చక్కని విశ్రాంతి తీసుకోండి. మంచి కాలక్షేపంతో సమయాన్ని ఆనందంగా మలచుకోండి.

మంచి హాబీలతో ప్రతిక్షణం ఆనందించవచ్చు. చిన్న చిన్న ఉద్యోగాలతో కూడా ఆనందంగా ఉండవచ్చు. కొత్తకొత్త రకాల పనులు చేస్తూ, ఆందంగా ఉండండి. దృక్పథం మారాలి.

మంచి దృక్పథంతో మంచి మంచి అనుభూతులు మీ సొంతం.

విహారయాత్రలు, వినోదయాత్రలు చేయవచ్చు. నదులు, సముద్రాలు చూడవచ్చు. మంచి మంచి రచనలు చేయవచ్చు. స్ఫూర్తిదాయకమైన కథలు చదవవచ్చు.

కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. జీవననైపుణ్యాలు నేర్చుకోవచ్చు. కొత్తకొత్త విద్యలు గురువుల వద్ద అభ్యసించవచ్చు. ఇలా నిత్యనూతనంగా జీవించ వచ్చు.

అప్పుడు బోరుగా ఉండదు. నవయవ్వనశక్తితో, నూతనోతైజంతో రాణించవచ్చు. ఇందులో సందేహంలేదు. మనస్సుకు వయస్సుతో నిమిత్తం లేదు.

వయస్సు శరీరానికే.
అందువల్ల ఎన్నో రకాలుగా, ఆనందంగా జీవించవచ్చు.

ప్రతిరోజూ పండుగ లాగా గడపాలి. ప్రతినిత్యం పండుగే జీవితం అమూల్యమైన వరం. ఈ వరాన్ని సద్వినియోగం పరచుకోవాలి.

అంతేకానీ నిరాశ, నిస్పృహలతో ఉండకూడదు.వాటిని దరకి చేరనీయవద్దు.

డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/