కులవృత్తిలేని ముదిరాజులు

సమస్య పరిష్కారానికి సమష్టి కృషి అవసరం

Mudirajas-File
Mudirajas-File

భారతదేశ జనాభాలో సగానికంటే ఎక్కువే బలహీనవర్గాల వాళ్లున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల విష యానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో 53 శాతం, తెలంగాణలో 59 శాతం, బిసిలున్నారు. అంటే దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేనంత బిసిల శాతం తెలంగాణలోఉంది.

ఈ బలహీనవర్గాలలో 112 కులాల ఉన్నట్లు 2013లో గుర్తించారు. ఒక్కొక్క కులానికి ఒక్కో కుల వృత్తి ఉంది. అందుకే చేతివృత్తుల వాళ్లు అని కూడా అంటారు. ఉదాహరణకు గౌడులకు గీతకార్మిక వృత్తి,పద్మశాలీలకు చేనేత వృత్తి.

ఇలా ఆయా కులాలకు వృత్తు లు ఏర్పడ్డాయి. కాని ముదిరాజులకు ఏ మాత్రం ప్రత్యేకంగా ఓ వృత్తి అంటూ లేదు. చాణిక్యుడి ‘ఆదిహిందూ చతుర్వర్ణ వ్యవస్థ లో కూడా ఎక్కడా ముదిరాజుల కులవృత్తి ప్రస్తావన లేదు.

ఓ నలభైయాభై ఏళ్ల క్రితం గ్రామాలలో పట్వారీల దగ్గర, మాలిపటే ల్‌ దగ్గర, పోలీసు పటేల్‌ దగ్గర, గ్రామపంచాయతీలలో ‘కావలి వాళ్లుగా అతి తక్కువ జీతాలకు పనిచేసేవారు ఈముదిరాజులు. అందుకే అప్పట్లో ముదిరాజులను ‘కావలి వాళ్లు అని కూడా అంటారు.

ప్రస్తుతం జాలర్లు కులస్తులు లేని గ్రామాలలో ముది రాజులు చెరువ్ఞలలో చేపలు పెంచడం, ఆ తరువాత వాటిని అమ్ముకొని జీవిస్తున్నారు.

మరి కొన్ని గ్రామాలలో పండ్లతోటలను యజమానుల దగ్గర కౌలుకు తీసుకుని వాటిని అమ్ముకొని జీవి తం గడుపుతున్నారు.ఒక్కోసారి లాభాలతోపాటు నష్టాలు కూడా వస్తుంటాయి.నష్టాలు వచ్చినప్పుడు వారి పరిస్థితిఏమిటి?

తెలం గాణ రాష్ట్రంలో సుమారు 30లక్షలమంది ముదిరాజు కులస్తులు న్నట్లు అంచనా.ఇందులో 80శాతం మంది గ్రామాలలో జీవనో పాధిలేక బతలేక నగర శివార్లకు వచ్చారు.చదువుకున్న వాళ్లు చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

మరికొంత మంది చిరు వ్యాపారాలు, వర్తకాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇంకొంత మంది రకరకాల కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

ఇక ఆర్థికపరంగ చూస్తే ముదిరాజులు మిగిలిన బిసిలలాగానే వెనుక బడి ఉన్నారని చెప్పవచ్చు. తెలంగాణలోని గ్రామాలలో ఇప్పటికి సరైన ఇండ్లు కూడా కట్టుకునే స్థితిలో లేక పూరి గుడిసెలలో జీవిస్తున్నారు.కారణం సరైన జీవనోపాధి లేకపోవడమే.

ఇక రాజ కీయరంగంలో ముదిరాజుల పాత్ర గురించి విశ్లేషిస్తే 1950 నుండి 2000 వరకు మిగిలిన బిసి కులాల వారి కంటే మెరు గ్గానే ఉండేదని చెప్పవచ్చు.

కాని ఏం లాభం?నేతలు వాళ్ల పదవ్ఞలు కాపాడుకోవడం కోసం నిలబెట్టుకోవడం కోసమే సరిపోయింది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన చూస్తే కనీసం ఓ పదిపదిహేను ఎమ్మెల్యేల గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు ముదిరాజులు.

ప్రస్తుతం 119 ఎమ్మెల్యేలకు గాను ఒకే ఒక్కరు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. కనీసం ముదిరాజుల జనాభా ప్రకారం ఓ పదిమంది ఎమ్మెల్యేలుండాలి.

ఈ విషయంలో బిసిలలో గౌడులు,యాదవ్ఞలు,కమ్మ కాపులు, కొంతలో కొంతవరకు పర్వాలేదు. ఇక సామాజిక రంగంలోచూస్తే బాగా వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు.

ప్రత్యేకించి కులవృత్తి లేకపోవడం చేత తగిన గుర్తింపు లేకుండాపోయింది.

ఈ మధ్య ముదిరాజునాయకులు,పెద్దలు తమ కులస్తులనుబిసిడి గ్రూపు నుండి బిసిఎ గ్రూపులోకి మార్చమని ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇది చాలా సమంజసమైన న్యాయమైన కోరిక అన్ని చెప్పవచ్చు.

ప్రత్యేకించి కులవృత్తిలేకపోవడం చేత తగిన గుర్తింపు లేకుండాపోయింది.ఏదిఏమైనా ముదిరాజులంతా ఏకమై ఒక్క తాటిపైకి వచ్చి మిగిలిన బలహీనవర్గాల వాళ్ల సహాయ, సహకారాలు తీసుకొని వాళ్లను కూడా కలుపుకొని కలిసి కట్టుగా ఉద్యమించాలి.

అలా ఒకటైన నాడు బలహీనవర్గాల బతుకులు కొంతలో కొంతైనా బాగుపడతాయి.

మునిగంటి శతృఘ్నాచారి, (రచయిత: కార్యదర్శి, రాష్ట్ర బిసి సంఘం, తెలంగాణ)

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/