మన వర్సిటీలకు అంతర్జాతీయ స్థాయి రావాలి

విద్యారంగ నాయకత్వం అన్వేషించాలి

Osmania University
Osmania University

ప్రపంచీకరణ అనంతరం భారతీయ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు స్వతహాగా, సంస్థా గతంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తీవ్రంగానే కృషి చేస్తూవచ్చాయి.

అయితే అకాడమిక్‌ నిపుణుల నాణ్యత,ప్రమాణాల విష యంలో రాజీపడకుండా సృజనాత్మక ఉన్నతస్థాయి అభ్యసనం జరిగినప్పు డే అంతర్జాతీయ స్థాయికి చేరుకోవటం సాధ్యమవుతుంది. ఇందు కోసం అధ్యాపకులనియామకాల సందర్భంలోనే ఖచ్చితమైన ప్రమా ణాలు పాటించాల్సిఉంది.

నైపుణ్యం ఆధారిత ఎంపిక, శిక్షణ, నిరంతర పరిశోధనల ద్వారా మాత్రమే ప్రాపంచిక ప్రమాణాలు అందుకోవచ్చు.ప్రపంచీకరణ భావన స్థానిక-ప్రపంచ శక్తుల అర్థవం తమైన ఏకీకరణ సైతం అధ్యాపకుల బోధనను మెరుగుపరుచుకు నేందుకు ఉపయోగపడింది.

ఇందుకు అవసరమైన విధానాలను విద్యారంగ నాయకత్వం అన్వేషించాల్సిన అవసరం ఉంది. విశ్వ విద్యాలయాన్ని నిర్దేశిత నియమ నిబంధనలు,చట్టాలకు లోబడే కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

అయితే సంబంధిత నియమ నిబం ధనలు సైతం అకాడమిక్‌ నిపుణుల చేతిలోనే విద్యా వ్యవస్థ కార్య నిర్వహణను చేపట్టే వెసులుబాటు కల్పించాయి.

విశ్వవిద్యాలయా లకు ఉన్నతస్థాయిలో ఉపకులపతికి విశేషమైన నిర్ణయాధికారాలు దాఖలు చేయబడి ఉన్నాయి.అయినప్పటికీ భారతీయ విద్యా వ్యవస్థలో ఉపకులపతి నియామకం మొదలు ప్రతి దశలోనూ రాజకీయ,అధికార జోక్యం ఫలితంగా ఉన్నత విద్య సంక్షిష్ట దశలో ఉందనే చెప్పకతప్పదు.

దీంతో అడుగడుగునా రాజీపడటం వల్ల ఆశించిన ఫలితాలు రావటం లేదనేది సుస్పష్టం.నాణ్యతా ప్రమా ణాల మెరుగుదల,అవసరమైన సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసేందుకు స్వయంప్రతిపత్తితో పాటు విశ్వవిద్యాలయా లకు మరింత సౌలభ్యాన్ని ఇవ్వాల్సిఉంది.

ఉన్నత విద్యారంగంలో ఉన్నతమైన, గౌరవనీయమైన హోదా కలిగిన ఉపకులపతి బాధ్య తను తీసుకునేందుకు ప్రతిప్రొఫెసర్‌ ఎంతో ఉత్సుకత చూపిస్తారు.

ఓ ఐఏఎస్‌ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ఐపిఎస్‌ అధి కారి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌కావాలని ఎలా కలలు కంటారో, అధ్యాపకులు సైతం ఉపకులపతి హోదాను చేరుకోవాలని కోరు కుంటారు.

ఇందుకోసం అత్యుత్తమ ప్రతిభ,పరిశోధనల్లో క్రియాశీలక భూమిక,అకాడమిక్‌లో మెరిట్‌ కనబరిచిన వారు ముందువరుసలో ఉండే వారు. కొన్నేళ్లుగా ఉపకులపతి ఎంపిక విధానంలో అనేక అపసవ్య ధోరణులు వచ్చి చేరాయి.

మెరిట్‌ చూడకుండా కులం, మతం పేరుతో నాయకత్వ లక్షణాలు,ముందు చూపు లేనివారిని ఉన్నతవిద్యకు నాయకులుగా ఎంపిక చేసుకునే వికృత ధోరణి కనిపిస్తోంది.

భారతీయ విశ్వవిద్యాలయాలు,ప్రత్యేకంగా వందేళ్ల చారిత్రక వారసత్వం కలిగిన ఉస్మానియా లాంటి విశ్వవిద్యా లయాలు ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలుగా, మేధోపరమైన కార్యకలాపాలకు వేదికగా వెలుగొందాలి. ప్రపంచంలోని మేటివిశ్వ విద్యాలయాల్లో ఒకటిగా ఉండాలి.

ప్రపంచ స్థాయి ఆధునికవిజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిర్విరామంగా పరిశోధనలతో ప్రపంచ యవనికపై వెలుగొందాల్సిన భారతీయ విశ్వవిద్యాలయాలు ఆ స్థాయిని అందుకోలేకపోయాయి.

అందుకు భిన్నంగా రాజకీయ కుతంత్రాలకు వేదికలుగా విద్యాలయాలు మారిపోయాయి.ఇందుకు ఏళ్లుగా విశ్వవిద్యాల యాలపట్ల పాలకుల చిన్నచూపు,నిధులలేమి, నాణ్యమైన ఆధ్యాపకుల కొరత కూడా కారణం.

రోజురోజుకూ అందు బాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,కొత్త పోకడలు,సమకాలీన విజ్ఞానాన్ని అందిపుచ్చు కోవటంలో వెనకబడుతున్నప్పటికీ సరైన సమయంలో సమస్యను పరిష్కరించలేకపోవటమే నేటి దుస్థికి కారణం.

విశ్వవిద్యాలయ పరిపాలన,అంతర్గత సమస్యలు,ఆర్థికంగా చితికిపోవటం మూలం గా పరిశోధనలు పడకేశాయి.నేటి పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయస్థాయి సంస్థలతో పోటీపడేసామర్థ్యాన్ని కోల్పోయింది.

ఉన్నత విద్యారంగం పరిస్థితి

చదువుల్లో నాణ్యతా లోపాల వల్ల విద్యారంగంలో భారత్‌ ఇప్పటికే యాభై ఏళ్లు వెనుకబడి ఉందని యునెస్కో అధ్యయన పత్రం గతంలోనే మెల్కొలిపే ప్రయత్నం చేసింది.

మౌళిక వస తులు మొదలుబోధనా సిబ్బంది లభ్యత వరకు అడుగడుగునా నాణ్యత ప్రమాణాలు కుంచించుకుపోవటమే ఇందుకు కారణం.

ఈ గడ్డ మీద జన్మించి ఉన్నతస్థాయి విద్యాసంస్థల నుంచి పిహెచ్‌డీ పట్టాలు పొంది అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వారిలో వేలాదిగా విదేశీవిశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన సేవలందిస్తున్నారు.

అమెరికా,బ్రిటన్‌,కెనడా,ఆస్ట్రేలియా,జపాన్‌ సహా విద్యారంగంలో రాణిస్తున్న దేశాలన్నీ సరిహద్దులకు అతీతంగా ఉత్తమ ఆచార్యులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఆకర్షణీయమైన ప్యాకేజీలతో తమ వైపు ఆహ్వానిస్తున్నాయి.

చైనా కొంత భిన్నంగా అంతర్జాతీ య సంస్థల్లో పనిచేస్తున్న తమ దేశీయులను తిరిగి స్వదేశంలో సేవలందించేలా భారీ జీతభత్యాలతో వెనక్కి రప్పిస్తోంది. రెండు దశాబ్దాలుగా విద్యారంగంలో తమ సంస్థలను ప్రపంచంలోనే మేటీ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు చైనా భారీగానే నిధులు వెచ్చి స్తోంది.

ఇటీవలే విభాగాల వారీగా అనేక అంశాలను మధించిన ప్రపంచ స్థాయి సంస్థక్వాక్‌క్వరెల్లి సైమాండ్స్‌(క్యూఎస్‌) విడుదల చేసిన అంతర్జాతీయ అత్యుత్తమ సంస్థల జాబితా చైనా పురోగ తిని స్పష్టంచేసింది.

ప్రపంచ అత్యుత్తమ 150 విద్యా సంస్థల జాబితాలో మన దేశానికి చెందిన విద్యా సంస్థలకు ఒక్క స్థానం కూడా లభించకపోవడం మన విద్యావ్యవస్థ తీరుతెన్నులను అద్దం పడుతోంది.

ఇదే సమయంలో అమెరికాలోని ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్‌, హార్వర్డ్‌,కాల్‌టెక్‌,చికాగోతో సహా బ్రిటీష్‌ విశ్యవిద్యాలయాలైన అక్స్‌ఫర్డ్‌,కేంబ్రిడ్జ్‌,యూసీఎల్‌,ఇంపిరీయల్‌లు మొదటి పదిస్థానాలు దక్కించుకున్నాయి.

చైనాలోని త్సిముహా విశ్వవిద్యాలయం 16వ స్థానాన్ని,పెకింగ్‌ 22,ఫుడాన్‌ 40,జెజింగ్‌ 54వ స్థానాన్ని పొంది ఆశ్చర్యపరిచాయి.

1980వ దశకంలో చైనా ఆర్థికపురోగతి ఇండియా కంటే వెనుకబడి ఉన్నది.చైనా నాయకత్వం, విద్య,సాంకేతిక నైపు ణ్యాలను అభివృద్ధిచేసిన పిదప ఈ రోజు ఇండియా కంటే ఐదు రెట్లు అధికంగా ఆర్థిక ఉన్నతిని సాధించింది.

దేశఅభివృద్ధి, పునర్ని ర్మాణంసమగ్రంగా జరగాలంటే విద్యను అభివృద్ది దేశాల సరసన, అంటే సుమారుగా 90శాతం నైపుణ్యాలతో కూడిన సమగ్రమైన మానవ వనరులను అభివృద్ధిపరిస్తేనే సాధ్యమవుతుందని చెప్ప వచ్చు

.ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశమైనా 95శాతం పైన సాధించిన విద్యతోనేఅభివృద్ధి సాధ్యమైనదని గణాంకాలు చెబుతు న్నాయి.ప్రతి విద్యార్థికి నాణ్యమైన,సరసమైన, సమానత్వంతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంది.

ఇదే క్రమంలో లెక్కకు మిక్కిలి ఆవిష్కరణలు,అద్భుతాలతో కూడిన సరికొత్త విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న పరివర్తన సమయంలో విశ్వవిద్యాలయాలు 21 శతాబ్దంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

చారిత్రక,సాంస్కృతిక వారసత్వాన్ని కొనసా గిస్తూ ప్రామాణిక నైపుణ్యాలను భవిష్యత్తు తరాలకు అందించే క్రమంలో ఒత్తిడికి లోనవుతున్నాయి.సంధి సమయాన్ని సైతం అవకాశంగా మలచుకోవాలి.

అన్ని రంగాల్లో భవిష్యత్తు నాయక త్వాన్ని అందించే విశ్వవిద్యాలయాలను గుర్తించాలి. అవి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ఆయా రంగాల్లో మెరికల్లాంటి నాయకత్వాన్ని అందించాల్సిన బాధ్యతను విశ్వవిద్యాలయాలు స్వీకరించాల్సిందే.

విశ్వవిద్యాలయాలకు సరైన వీసీలను ఎంపిక చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. అప్పుడే విశ్వవిద్యాలయాలు దేశాభివృద్ది లో తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తాయి.

  • ప్రొఫెసర్‌ వి.జగదీశ్వర్‌రావు, ఉస్మానియా యూనివర్సిటీ

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/