కొత్త ఓటర్‌ లిస్ట్‌తోనే ఎన్నికలు జరపాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌

ghmc-Elections - voter list
ghmc-Elections – voter list

2010, 2015లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు అప్పటి డీలిమిటేషన్‌ ప్రకారమే జరుగుతున్నాయి. ఓటర్ల సంఖ్య మధ్య అప్పటి నుండే పెద్ద ఎత్తున తేడాలున్నాయి. ఈ పదేళ్లలో ఈ తేడాలు మరింత పెరిగాయి.

ఎన్నికయ్యే కార్పొరేటర్ల మధ్య ఓటర్ల సంఖ్యలో సమతుల్యత ఉండాలి. కానీ ఇది జరగడం లేదు. కనుక ఇప్పటికైనా మొత్తం జిహెచ్‌ఎంసి పరిధిలో 150 డివిజన్లను మళ్లీ డీలిమిటేషన్‌ చేయాలి. ఓటర్ల సంఖ్య మధ్య పది శాతం కంటే ఎక్కువ తేడా ఉండకుండా చూడాలి.

లేకపోతే శివారు ప్రాంత మున్సిపాలిటీలు కలసిన జిహెచ్‌ఎంసి ప్రాంతంలో మరొక 50వ డివిజన్‌లు కొత్తగా ఏర్పాటు చేయాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సి పల్‌ కార్పొరేషన్‌ పాలక వర్గం పదవీకాలం 2021 ఫిబ్రవరి నెలవరకు ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే జిహెచ్‌ ఎంసి ఎన్నికలనిర్వహణకు కసరత్తు చేస్తోంది.

గతంలో లాగే ఈసారి కూడా మేయర్‌ పదవికి పరోక్ష ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్‌ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకరమైన పరి ణామంకాదు.స్థానిక ప్రభుత్వాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యమే మంచిది.

150 డివిజన్లలో 76 డివిజన్‌లు గెలిచినవారు మేయర్‌ అవుతారు అన్న గ్యారెంటీ కూడా లేదు.

జిహెచ్‌ఎంసిలో ఎక్స్‌ అఫీ షియో సభ్యులుగా ఎమ్మెల్యేలకు ఎంపిలకు ఎమ్మెల్సీలకు మేయర్‌ ను ఎన్నుకోవడానికి ఓటుహక్కుఇస్తే ఎన్నికైన ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన కార్పొరేటర్ల పాత్ర నామమాత్రమే అవుతుంది.

ప్రజాస్వా మ్య ఒక పార్టీ నుండి గెలిచి మరొకపార్టీకి మద్దతు ఇచ్చినవారు కూడా ఉంటున్నారు. బొటాబొటి మెజారిటీ వచ్చిన సందర్భాలలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎంపిలు ఫిరాయించినట్లుగానే కార్పొరేటర్లు కూడా పార్టీలు ఫిరాయించి ప్రజల ఆకాంక్షలకు గండి కొడుతున్నా రు.

పరోక్ష ఎన్నికలవల్ల క్యాంపు రాజకీయాలు,డబ్బు, బేరసారాలు మద్యం రాజకీయాలు పెరిగిపోతాయి.

రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వా లకు ప్రత్యక్ష ఎన్నికలు కొత్తకావు. 2002లో హైదరాబాద్‌ మున్సి పల్‌ కార్పొరేషన్‌ మేయర్‌కి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి.

అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో గ్రామపంచాయతీ సర్పంచ్‌, సమితి అధ్యక్షులు మొదలుకొని జిల్లాపరిషత్‌ ఛైర్పర్స న్లు,మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు నుండి కార్పొరేషన్‌ల మేయర్‌ పదల వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి.

ఇప్పటికైనా ప్రభుత్వం ఆలో చించి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలి.

అలాగే ఈ ఎన్నికల్లో మరో రెండు సమస్యలు ముందుకువస్తున్నాయి. ఇప్పుడు ఉన్న డివిజన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని 2020 జనవరి 1 నాటికి సవరించిన ఓటరు జాబితాను జిహెచ్‌ఎంసి ఎన్నికలలో ఉపయోగిస్తామని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

కానీ ఇది సరై నది కాదు.ఈ విషయంపై ఎవరైనా కోర్టుకు వెళితే జిహెచ్‌ఎంసి ఎన్నికలకు బ్రేకులుపడే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ సమగ్రంగా ఆలోచించి ముందుకువెళ్లాలి. 2015 లో జిహెచ్‌ఎంసికి ఎన్నికలు జరిగాయి.

అప్పుడు ఏర్పాటు చేసిన డివిజన్ల ప్రకారమే ప్రస్తుత ఎన్నికలు కూడా జరుగుతాయని తెలు స్తుంది. ప్రస్తుతమున్న డివిజన్ల డిలిమిటేషన్‌ కాకుండా ఎన్నికలు జరిపితే రెండు సమస్యలు వస్తాయి. మొదటిది డివిజన్లలోని ఓటర్ల సంఖ్యచాలా పెద్ద సంఖ్యలో తేడా ఉంది. ఉదాహరణకు గతంలో ఎంసిహెచ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఉన్నప్పుడు హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ జంట నగరాలలో వంద డివిజన్లు మాత్రమే ఉండేవి.

ఆ తర్వాత 2009లో ఎంసిహెచ్‌ చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీలు జిహెచ్‌ఎంసిలో కలిపి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేశారు. అప్పుడు కొత్తగా డివిజన్‌ల విభజన అవసరమైంది.

కానీ పాత ఎంసిహెచ్‌ పరిధిలోని 100 డివిజన్లు అలాగే ఉంచి అప్పుడు జిహెచ్‌ఎంసిలలో కలిసిన 12 మున్సిపాలిటీల పరిధిలో మరొక 50 డివిజన్‌లు కొత్తగా ఏర్పాటు చేసి మొత్తం 150 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. 2010, 2015లో జరిగిన గ్రేటర్‌హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు అప్పటి డీలిమిటేషన్‌ ప్రకారమే జరుగుతున్నాయి.

ఓటర్ల సంఖ్య మధ్య అప్పటి నుండే పెద్ద ఎత్తున తేడాలున్నాయి. ఈ పదేళ్లలో ఈ తేడాలు మరింత పెరి గాయి.ఉదాహరణకు పాత హైదరాబాద్‌ నగరంలో సుమారు 50కి పైగా డివిజన్లు ఉన్నాయి. అక్కడ 30వేల లోపు ఓటర్లకు కొన్ని డివిజన్‌లు ఏర్పాటు చేశారు.

కానీ హైదరాబాద్‌ శివార్లలో ఉన్న శేర్లింగంపల్లి, పటాన్‌చెరువు, కూకట్‌పల్లి లాంటి ప్రాంతాలలో లక్ష పైచిలుకు ఓటర్లు ఉన్న డివిజన్‌లు కూడా ఉన్నాయి. ఎన్నికయ్యే కార్పొరేటర్ల మధ్య ఓటర్ల సంఖ్యలో సమతుల్యత ఉండాలి. కానీ ఇది జరగడం లేదు. కనుక ఇప్పటికైనా మొత్తం జిహెచ్‌ఎంసి పరిధిలో 150 డివిజన్లను మళ్లీ డీలిమిటేషన్‌ చేయాలి. ఓటర్ల సంఖ్య మధ్య పది శాతం కంటే ఎక్కువ తేడా ఉండకుండా చూడాలి.

లేకపోతే శివారు ప్రాంత మున్సిపాలిటీలు కలసిన జిహెచ్‌ఎంసి ప్రాంతంలో మరొక 50వ డివిజన్‌లు కొత్తగా ఏర్పాటు చేయాలి. అప్పుడు మొత్తం డివిజన్ల సంఖ్య 200 అవుతుంది.

2015 కంటే ముందు ప్రభుత్వం ఈ రకంగా ఆలో చించింది.కానీ అప్పటికే విడిపోయిన తెలంగాణ రాష్ట్రఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసిన సంఖ్య కంటే ఇది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కనుకపాలకవర్గ సమావేశాలు జరగడం వాటిని ఏర్పాటు చేయడానికి ఫంక్షన్‌ హాల్స్‌ కూడా సరిపోవని ఆ ప్రతిపాదనను మానుకున్నారు.

అదీకాక అసలు కంటే కొసరు ఎక్కువ అని కార్పొరేటర్ల సంఖ్యకు సరిసమానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సి పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 24 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు లోక్‌సభ సభ్యులు మరికొందరు హైదరాబాద్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, జిహెచ్‌ఎంసి అధికారులు కలిసి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ పాలకవర్గ సమావేశాల్లో పాల్గొన డానికి మరొక 150 మంది అవ్ఞతున్నారు. వీళ్లంతా కలిస్తేమూడు వందలపైనే అవ్ఞతారు. అందుకే అప్పుడు కార్పొరేటర్ల సంఖ్య 150కి మించి పెంచలేదు.

ఇప్పుడైనా ఆ సమస్య వస్తుంది కనుక ఉన్న 150 డివిజన్ల ఓటర్ల సంఖ్యలో సమతుల్యత చేయాలి. ఇక రెండవ సమస్య ఇప్పటికే జాతీయ ఎన్నికల కమిషన్‌ ప్రతిసారీ చేసినట్లుగానే ఓటర్ల సమ్మరీ రివిజన్‌ను ప్రారంభించింది.

జనవరి ఒకటి 2021 నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి కొత్తగా ఓటు హక్కు లభిస్తుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇలా కొత్త ఓటు హక్కు పొందడానికి మరొక మూడు నాలుగు లక్షల మంది అర్హులు అవుతారు.

ఒకవేళ ఓటర్‌ లిస్ట్‌ ప్రకారం జరిగితే కొత్త యువత ఓటర్లకు అన్యాయం జరుగుతుంది. రేపటి ఎన్నికలలో వారు ఓటువేసే అవకాశం కోల్పోతారు.

అలా జరగకుం డా ఉండాలంటే ఆదరాబాదరాగా ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు. 2021 ఫిబ్రవరి 15లోపు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. కనుక 2021 జనవరి 15 కల్లా కొత్త ఓటర్‌ లిస్ట్‌ ఫైనల్‌ చేసి ప్రక టిస్తారు.

కనుక ఆ ఓటర్‌ లిస్ట్‌ ప్రకారం డివిజన్ల విభజన ఓటర్‌ లిస్ట్‌లో చేర్పులు మార్పులు జరిగిన తర్వాత కొత్త ఓటర్‌ లిస్ట్‌తోనే ఎన్నికలు జరిగితే బాగుంటుంది.

ఈ దిశగా రాష్ట్రప్రభుత్వంతోపాటు రాష్ట్రఎన్నికలకమిషన్‌ ఆలోచించి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సి పల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరపాలి.

లేకపోతే ఎవరైనా కోర్టుకు వెళ్లి ఈ అవకతకవకలను ఛాలెంజ్‌ చేస్తే మళ్లీ ఎన్నికలకు బ్రేక్‌ పడి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతుంది.

  • బండారు రామ్మోహనరావు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/