మాజీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి పై కేసు నమోదు

ఫిక్సిడ్ డిపాజిట్ల నుంచి ఫోర్జరీ చేసి రుణం తీసుకున్నాడని ఫిర్యాదు

మాజీ సీఎం  వ్యక్తిగత కార్యదర్శి పై కేసు నమోదు
FIR case filed

Amaravati: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి మనోహర్ పై కేసు నమోదు అయ్యింది.

కుప్పం కోపరేటివ్ వ్యాంక్ లోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం ఫిక్సెడ్ డిపాజిట్ల నుంచి తన సంతకాలను ఫోర్జరీ చేసి రుణం తీసుకున్నాడంటూ వైకాపా నేత విద్యాసాగర్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మనోహర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసులు బనాయించారని మనోహర్ ఆరోపించారు.

తాజా ‘చెలి శీర్షికల కోసం :https://www.vaartha.com/specials/women/