225 రకాలతో 90 లక్షల బతుకమ్మ చీరలు ఆర్డర్

హైదరాబాద్: సీఎం కెసిఆర్ తెలంగాణ ఆడపడుచులకు కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలు 225 రకాలతో 90 లక్షల ఆర్డర్ ఇచ్చామని, ఇప్పటి వరకు బతుకమ్మ చీరల ఉత్పత్తి 40 శాతం పూర్తయిందని, లాక్‌డౌన్ సడలిస్తే అక్టోబర్ వరకు చీరల తయారీ పూర్తవుతుందని టెస్కో ఎండి శైలజ రామయ్యర్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి రూ.80 కోట్ల యూనిఫామ్ ఆర్డర్ టెస్కోకు వచ్చిందని, ప్రభుత్వ వెల్ఫేర్ పాఠశాలల నుంచి రూ.70 కోట్ల ఆర్డర్ వచ్చిందన్నారు. లాక్‌డౌన్ సడలింపు ఉంటే రెండు మూడు నెలల్లో విద్యార్థుల యూనిఫామ్ తయారు చేస్తామని వెల్లడించారు. లాక్‌డౌన్ సడలింపులు ఉంటే చేనేత రంగం పనులు యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. హ్యాండ్లూమ్, పవర్ లూమ్ క్లాత్‌తో మాస్కులు తయారు చేయిస్తున్నామనిరెండు లక్షలకు పైగా క్లాత్ మాస్కుల తయారీకి ఆర్డర్లు ఇచ్చామని శైలజ పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/andhra-pradesh/