గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కాపీరైట్‌ ఉల్లంఘన కేసు

ముంబయి: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై మహారాష్ట్రలో ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. కాపీ రైట్‌ ఉల్లంఘనపై కోర్ట్‌ ఆదేశాల మేరకు ఎంఐడీసీ(మహారాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) స్టేషన్‌లో పిచాయ్‌తోపాటు మరో ఐదుగురిపై కూడా కేసులు నమోదయ్యాయి. డైరెక్టర్‌ – ప్రొడ్యూసర్‌ సునీల్‌ దర్శన్‌ ఫిర్యాదు మేరకు కాపీరైట్‌ ఉల్లంఘన కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

2017లో విడుదలైన తన ఏక్‌ హసీనా థీ ఎక్‌ దివానా థా సినిమాకు సంబంధించి ఎలాంటి హక్కులు ఇవ్వకపోయినా గూగుల్‌ యాజమాన్యంలోని యూట్యూబ్‌ ఈ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిందని దర్శన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/