టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీకాంత్..

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్‌ను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కోశాధికారి, రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి అయిన శ్రీకాంత్‌ గెలుపునకు సహకరించాలని కోరుతూ మూడు జిల్లాల పరిధిలోని పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులకు చంద్రబాబు ఫోన్ చేసి విన్నవించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేసిన శ్రీకాంత్.. పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలో బిజీ గా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయ డంఖా మోగించాలని కష్టపడుతున్నారు. మరోపక్క చంద్రబాబు పర్యటన కు ప్రజలు బ్రహ్మ రథంపడుతుండడంతో నేతల్లో కొత్త ఉత్సహం మొదలైంది. మరోపక్క లోకేష్ సైతం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రోడ్డెక్కుతానని ప్రకటించారు. నిన్న గురువారం పల్నాడు లో లోకేష్ పర్యటించారు. హత్యకు గురైన జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్​.. రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. జల్లయ్య ముగ్గురు పిల్లల్ని తాను వ్యక్తిగతంగా చదివిస్తానని లోకేశ్​ హామీ ఇచ్చారు. ఇక ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిలదీస్తూ.. త్వరలోనే రోడ్డెక్కుతానని లోకేష్ ప్రకటించారు. తన కార్యక్రమం పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు ప్రజల్లో తిరుగుతున్నారని​.. తనతో పాటు నేతలంతా ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. తన కార్యక్రమం 9గంటలు ఆలస్యమైనా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలికారు.. జగన్ రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో దీనిబట్టే తెలుస్తోందన్నారు.