హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు..

ఎన్టీఆర్ పార్కు వద్ద కారు బీబత్సం సృష్టించింది. హుస్సేన్ సాగర్ లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటన లో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు ప్రమాద విషయం తెలియగానే పోలీసులు చేరుకొని కారులో ఉన్న యువకులను బయటకు తీసి.. సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
యువకులను ఖైరతాబాద్‌కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. కారును నాలుగు రోజుల క్రితమే తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అధిక వేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.