పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. శనివారం రాత్రి ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు వెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఆపిఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

ప్రమాద సమయంలో వాహనంలో 22 మందికిపైగా ఉన్నారని పోలీసులు తెలిపారు. దట్టంగా కమ్ముకున్న పొగమంచు, వ్యాన్‌ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌తో సహా మొత్తం 18 మంది మరణించారు. మృతుల్లో 10 మంది పురుషులు ఉండగా.. ఆరుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నారు.