సికింద్రాబాద్ లో యధావిధిగా రైళ్ల పునరుద్ధరణ

సికింద్రాబాద్ లో యధావిధిగా రైళ్ల పునరుద్ధరణ చేసారు అధికారులు. లింగంపల్లి నుండి కాకినాడ వెళ్లవలసిన ట్రైన్ స్టార్ట్ అయ్యింది. లింగంపల్లి నుండి సికింద్రాబాద్ కు చేరుకుంది. ఉదయం 8 గంటల నుండి సికింద్రాబాద్ లో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఉదయం నుండి సాయంత్రం వరకు సికింద్రాబాద్ అగ్నిగుండంలా ఉంది. అగ్నిపథ్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. స్టేషన్ లో నిలిచి ఉన్న రైళ్ల బోగీలకు నిరసనకారులు నిప్పు పెట్టారు.

పెద్ద సంఖ్యలో నిరసన కారులు స్టేషన్ లోకి తీసుకొచ్చారు. రాళ్లతో రైళ్ల అద్దాలను ధ్వసం చేసారు. ఆర్మీ అభ్యర్ధులు కేంద్రం నిర్ణయం కారణంగా.. జీవితాలు నష్టపోతున్నామంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఆ నిర్ణయం వెంటనే రద్దు చేసి ఆర్మీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసారు. తాము దేనికైనా సిద్దమేనని..వెనక్కు తగ్గమని స్పష్టం చేస్తూ వచ్చారు. రైళ్లకు నిప్పు పెట్టటంతో పాటుగా లగేజీ రాక్ లు..అదే విధంగా.. అక్కడ ఉన్న క్యాంటీన్లు.. స్టాళ్లను పూర్తిగా ధ్వంసం చేసారు. రైళ్ల పైకి రాళ్లు విసరడటంతో పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన.. వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎక్కడికి అక్కడే నిలిపివేసారు. పలు రైళ్లను రద్దు చేసారు. పెద్ద సంఖ్యలో నిరసన కారులు రైళ్ల ముందు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. దీంతో..పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రయాణీకులు భయంతో స్టేషన్ నుంచి బయటకు వెళ్లారు. స్టేషన్ బయట బస్సులను ధ్వంసం చేసారు. మంటలను అదుపు చేయటానికి పెద్ద సంఖ్యలో ఫైర్ సిబ్బంది స్టేషన్ కు చేరుకున్నారు. ఇక ఆందోళన కారుల నిరసన నేపథ్యంలో దాదాపు 20 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో అంత సెట్ అయ్యింది. ప్రయాణికులు కూడా వస్తున్నారు. రైళ్లు కూడా స్టార్ట్ చేసారు.