రాజేంద్రనగర్లో కారు బీభత్సం..

రాజేంద్రనగర్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అంతాఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో రెండు షాపులు, ఒక బైకు పాక్షికంగా ధ్వంసమైయ్యాయి. కారు ముందు భాగం డ్యామేజ్ అయ్యింది. సంఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఎవ్వరు లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

నిర్లక్ష్యంగా కారు నడిపాడని అగ్రహించిన స్థానికులు డ్రైవర్ పై దాడికి యత్నం చేశారు. ఈ క్రమంలో కారు వదలి పారిపోయాడు. మే 18వ తేదీ గురువారం ఉదయం అమెరికా నుండి హైదరాబాద్ కు వచ్చాడు ఆ యువకుడు. మితిమీరిన వేగంతో కారు నడిపి ఆక్సిడెంట్ చేశాడంటున్నారు స్థానికులు తెలిపారు.