అప్పుడు చైన్ తో వచ్చా..ఇప్పుడు కత్తితో వస్తున్న – నాగ్

అప్పుడు చైన్ తో వచ్చా..ఇప్పుడు కత్తితో వస్తున్న అన్నాడు కింగ్ నాగార్జున. నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున చేస్తూ సినిమా ఫై క్రేజ్ తీస్తున్నారు. ఆదివారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుకగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు నాగార్జున తో పాటు నాగ చైతన్య , అఖిల్ లు సైతం హాజరు కావడం విశేషం. ఈ ముగ్గుర్ని ఒకే ఫ్రెమ్ లో చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఇక ఈ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవాళ చైతన్య, అఖిల్, నేను ఇక్కడ ఇంత ప్రేమను పొందగలుతున్నామంటే ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి తెలుగు సినీ పరిశ్రమకు.. మరొకటి మా నాన్న గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి.. 33 ఏళ్ల క్రితం అక్టోబర్ 5న మీ ముందుకు చైన్ పట్టుకొచ్చాను. అదే అక్టోబర్ 5న ఒక కత్తితో వస్తున్నా మీ ముందుకు. ఇది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. విజయ దశమి పండగ సందర్భంగా మా ది ఘోస్ట్ మూవీ కూడా విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నా అంటూ తెలిపారు. అంతే కాదుఅక్టోబర్ 5న నాకు ఎంతో ఆప్తులయిన చిరంజీవి గారి సినిమా కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలకి విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్..’ అని తెలిపాడు.