బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన కేంద్రం

ఈ నెల 31వరకూ రద్దు

cancellation of flights from Britain
cancellation of flights from Britain

కొత్తరకం కరోనా వైరస్ బ్రిటన్ లో విజృంభిస్తున్న నేపథ్యంలొ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను ఈ నెల 31వరకూ రద్దు చేసింది.

ఈ రద్దు నిర్ణయం రేపు అర్ధరాత్రి నుంచి అమలులోనికి వస్తుంది. ఇప్పటికే పలు యూరప్ దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ బాటలోనే భారత్ కూడా నడుస్తోంది. కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బ్రిటన్ నుంచి వచ్చే అన్ని రకాల విమానాలనూ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర విమానయాన సంస్థ తెలిపింది.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/