ఎపిలో టెన్త్‌ పరీక్షలు రద్దు

ప్రభుత్వం నిర్ణయం

10th Class Examinations -File
10th Class Examinations -File

అమరావతి: 2019-20 విద్యాసంవత్సరానికి గానూ జూలై 10 నుంచి 17 దాకా జరగాల్సి ఉన్న పదో తరగతి పరీక్షలను రాష్ట్రంలో రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..

రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు..

కాగా ఈనెల 18న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌ విద్యాశాఖాధికారులతో జరిగిన సమావేశంలో సమగ్రంగా చర్చించిన తర్వాత పరీక్షల నిర్వహణ కష్టాలను జాగ్రత్తగా అంచనా వేశాక , విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది..

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/